ఆకర్షణీయంగా వాట్సప్‌ టెక్స్ట్‌

వాట్సప్‌లో ఎప్పుడూ ఒకేరకం టెక్స్ట్‌ చూసి బోర్‌ కొడుతోందా? ఇకపై అలాంటి బెంగ అవసరం లేదు. త్వరలోనే కొత్త టెక్స్ట్‌ ఎడిటర్‌ సదుపాయం రాబోతోంది.

Published : 12 Apr 2023 00:08 IST

వాట్సప్‌లో ఎప్పుడూ ఒకేరకం టెక్స్ట్‌ చూసి బోర్‌ కొడుతోందా? ఇకపై అలాంటి బెంగ అవసరం లేదు. త్వరలోనే కొత్త టెక్స్ట్‌ ఎడిటర్‌ సదుపాయం రాబోతోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్‌ బీటా వర్షన్‌ మీద దీన్ని పరీక్షిస్తున్నారు. భవిష్యత్‌ అప్‌డేట్‌తో ఇది అందరికీ అందుబాటులోకి రావొచ్చని భావిస్తున్నారు. దీని ద్వారా అక్షరాలను వివిధ రకాల ఫాంట్లలో కూర్చుకోవచ్చు, సవరించుకోవచ్చు. కావాలంటే ఫాంట్లను తమదైన శైలిలోకీ మార్చుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు, జిఫ్‌లకు టెక్స్ట్‌నూ జోడించుకోవచ్చు. పదాల వెనక భాగం రంగునూ మార్చుకునే వీలుంది. దీంతో ముఖ్యమైన విషయాన్ని కొట్టొచ్చినట్టు సూచించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని