ఇల్లే స్టేడియం
దిగ్గజ టెలికం సంస్థ రిలయన్స్ జియో సరికొత్త వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్‌సెట్‌ను తీసుకొచ్చింది. దీని పేరు జియోడైవ్. దీంతో ఇంట్లోంచే ఐపీఎల్ పోటీలను స్టేడియంలో కూర్చొని చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
దిగ్గజ టెలికం సంస్థ రిలయన్స్ జియో సరికొత్త వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్‌సెట్‌ను తీసుకొచ్చింది. దీని పేరు జియోడైవ్. దీంతో ఇంట్లోంచే ఐపీఎల్ పోటీలను స్టేడియంలో కూర్చొని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇది ఫోన్‌లోని గైరోస్కోప్, యాక్సెలోమీటర్‌తో అనుసంధానమై 360 డిగ్రీల కోణంలో మ్యాచ్‌ను చూస్తున్న భావన కలిగిస్తుంది. దీని ద్వారా బర్డ్స్ ఐ, స్టంప్ క్యామ్, కేబుల్ క్యామ్.. ఇలా వివిధ కోణాల్లో క్రికెట్ పోటీలను చూడొచ్చు. ఇది ఐపీఎల్ వీక్షణను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. నలుపు రంగులో లభించే జియోడైవ్‌ను 6.7 అంగుళాల తెరతో కూడిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా ఐఫోన్‌తో అనుసంధానం చేసి ఐపీఎల్ మ్యాచ్‌లను చూడొచ్చు. ఇందుకోసం జియోఇమ్మర్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో జియోమార్ట్ ద్వారా జియోడైవ్‌ను కొనుక్కోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ IPL Final: ఐపీఎల్ టాప్ 10 కథనాలు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ విజేత ధోనీ సేన అయినా.. ఎక్కువ అవార్డులు ఆ జట్టుకే..
-
Movies News
Allu Arjun: నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.. మా నాన్నే నాకు దేవుడు..: అల్లు అర్జున్
-
Sports News
Dhoni - Jaddu: మహీ భాయ్.. కేవలం నీ కోసమే: వైరల్‌గా మారిన జడ్డూ పోస్టు
-
India News
Manipur: మణిపుర్లో పరిస్థితులు సద్దుమణిగేందుకు కొంత సమయం పడుతుంది: సీడీఎస్
-
India News
ఫోన్ కోసం రిజర్వాయర్ తోడిన ఘటన.. ఆ నీళ్లకు డబ్బులు వసూలు చేయండి..!