ఇన్‌స్టా ఫొటోలు అదృశ్యం!
ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో ఎన్నో ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు. కొన్నిసార్లు వద్దనుకుంటే వాటిని డిలీట్ చేసుకోవచ్చు. కానీ అవసరమైనప్పుడు తిరిగి పోస్ట్ చేయాల్సిందే. మరి డిలీట్ చేయకుండానే ఫొటోలు ఇతరులకు కనిపించకుండా దాచేస్తే? దీనికీ మార్గముంది. ఆర్కయివ్ చేసుకుంటే సరి.
ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో ఎన్నో ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు. కొన్నిసార్లు వద్దనుకుంటే వాటిని డిలీట్ చేసుకోవచ్చు. కానీ అవసరమైనప్పుడు తిరిగి పోస్ట్ చేయాల్సిందే. మరి డిలీట్ చేయకుండానే ఫొటోలు ఇతరులకు కనిపించకుండా దాచేస్తే? దీనికీ మార్గముంది. ఆర్కయివ్ చేసుకుంటే సరి.
* ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆర్కయివ్ చేసుకోవాలనుకునే ఫొటోను క్లిక్ చేయాలి.
* తెరకు పైన కుడి మూలన కనిపించే నిలువు మూడు చుక్కల మీద ట్యాప్ చేయాలి. అప్పుడు తెర కింద మెనూ పాపప్ అవుతుంది.
* మెనూలో ఆర్కయివ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు. ఫ్రొఫైల్, ఫీడ్ నుంచి అదృశ్యమవుతుంది. ఫాలోయర్లు దాన్ని చూడలేరు.
ఆర్కయివ్ ఫొటోలు చూడాలంటే?
ప్రొఫైల్ స్క్రీన్‌లో పైన కుడి మూలన ఉండే అడ్డం మూడు గీతలను నొక్కాలి. ఇందులో ఆర్కయివ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిలోకి వెళ్లి పోస్ట్స్ ఆర్కయివ్ ఆప్షన్ అన్నింటికన్నా మీద ఉండేలా సెట్ చేసుకోవాలి. ఆర్కయివ్ చేసిన ఫొటోలు మనకు మాత్రమే కనిపిస్తాయి. లైకులు, వ్యాఖ్యలన్నీ పోస్ట్ మీద అలాగే ఉంటాయి. అయితే అంతకుముందు వాటిని లైక్, కామెంట్ చేసినవారికి అవి కనిపించవు. తిరిగి పోస్ట్ చేస్తేనే అవి కనిపిస్తాయి.
తిరిగి పోస్ట్ చేయాలంటే?
ఆర్కయివ్ చేసిన ఫొటోను ఓపెన్ చేసి, పైన కుడివైపు కనిపించే మూడు చుక్కలను తాకాలి. తర్వాత షో ఆన్ ప్రొఫైల్ ఆప్షన్‌ను ఎంచుకుంటే తిరిగి ఫీడ్‌లో దర్శనమిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Jaishankar: ఐరాస వేదికగా.. కెనడా, పాకిస్థాన్‌లకు జైశంకర్ చురకలు!
-
Nara Lokesh: 29 నుంచి లోకేశ్ పాదయాత్ర తిరిగి ప్రారంభం
-
Demat nominee: డీమ్యాట్ ఖాతాలకు నామినీ గడువు పొడిగింపు
-
Padmanabha reddy: రూ.10వేల కోట్లు ఫ్రీజ్ చేయండి: సీఈసీకి పద్మనాభరెడ్డి లేఖ
-
Harish Rao: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం.. ఆందోళన వద్దు: మంత్రి హరీశ్‌రావు