అనుకున్న సమయానికే ట్వీట్‌

వేదిక. తాజా కబుర్లు, సంఘటనలు, అంశాల మీద అప్పటికప్పుడు అభిప్రాయాలను కలబోసుకోవటానికిది పెట్టింది పేరు. తమను అనురించేవారి కోసం తరచూ ట్వీట్‌ చేయటం ఎంత ముఖ్యమో తెలియంది కాదు.

Updated : 14 Jun 2023 04:08 IST

ట్విటర్‌ అంటేనే ప్రత్యక్ష చర్చా వేదిక. తాజా కబుర్లు, సంఘటనలు, అంశాల మీద అప్పటికప్పుడు అభిప్రాయాలను కలబోసుకోవటానికిది పెట్టింది పేరు. తమను అనురించేవారి కోసం తరచూ ట్వీట్‌ చేయటం ఎంత ముఖ్యమో తెలియంది కాదు. అయితే కొన్నిసార్లు సెలవులు గడపటానికి ఎక్కడికైనా వెళ్లొచ్చు. ట్విటర్‌కు దూరంగా ఉండాలని అనిపించొచ్చు. ఇలాంటి సమయాల్లోనే  నిర్ణీత సమయానికి ట్వీట్లను పోస్ట్‌ చేసే ఫీచర్‌ ఉపయోగపడుతుంది. దీంతో ట్విటర్‌లో నిరంతరం చురుకుగా ఉండేలా చూసుకోవచ్చు. అనుకున్న సమయానికి ట్వీటడానికి ముందుగా డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్‌టాప్‌లో ట్విటర్‌ పేజీని ఓపెన్‌ చేసి, లాగిన్‌ అవ్వాలి. ట్వీట్‌ను టైప్‌ చేశాక వెంటనే ట్వీట్‌ను క్లిక్‌ చేయకుండా క్యాలెండర్‌ గుర్తు మీద క్లిక్‌ చేయాలి. షెడ్యూల్‌ బాక్స్‌లో ట్వీట్‌ ప్రచురితం కావాల్సిన నెల, తేదీ, సంవత్సరం, సమయాన్ని ఎంచుకోవాలి. తర్వాత కన్‌ఫర్మ్‌ బటన్‌ను నొక్కాలి. అంతే నిర్ణయించుకున్న సమయానికి ట్వీట్‌ పబ్లిష్‌ అవుతుంది. అయితే ఈ ఫీచర్‌ ట్విటర్‌ మొబైల్‌ యాప్‌లో అందుబాటులో ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని