ఆ జీవ ప్రయోగంలో గాజు

భూమి మీద ప్రాణుల పుట్టుకకు సంబంధించి 1950లో నిర్వహించిన ‘మిల్లర్‌-ఉరే ప్రయోగం’ చాలా ప్రాచుర్యం పొందింది. ఇది ప్రకృతిని దాదాపు పూర్తిగా అనుకరించింది. తొలిదశలో భూమి...

Published : 27 Oct 2021 01:58 IST

భూమి మీద ప్రాణుల పుట్టుకకు సంబంధించి 1950లో నిర్వహించిన ‘మిల్లర్‌-ఉరే ప్రయోగం’ చాలా ప్రాచుర్యం పొందింది. ఇది ప్రకృతిని దాదాపు పూర్తిగా అనుకరించింది. తొలిదశలో భూమి మీద రసాయన పరిస్థితులను తిరిగి సృష్టించటం దీనిలోని కీలకాంశం. కేవలం నీరు, అమోనియా, హైడ్రోజన్‌, మీథేన్‌, మెరుపులకు ప్రతిగా ఎలక్ట్రిక్‌ మిణుగురులతోనే ఇందులో జీవుల పుట్టుకకు అవసరమైన పలు ప్రొటీన్ల తొలి రూపాలను సృష్టించగలిగారు. అయితే ఈ ప్రయోగానికి ఉపయోగించిన గాజు బీకరు సైతం ఇందులో కీలక పాత్ర పోషించటం విశేషం. గాజులో సిలికేట్లు ఉంటాయి. ఇవి రసాయన మిశ్రమంలో కరుగుతాయి. తిరిగి శోషణకు గురవుతాయి. అందుకే గాజు పాత్ర భూమి మీద రాళ్ల మాదిరిగా పనిచేసి, రసాయన ప్రతిచర్యలకు ఉత్ప్రేరకంగా నిలిచినట్టు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. టెఫ్లాన్‌ బీకరు, గాజు ముక్కలు కలిపిన టెఫ్లాన్‌ బీకరుతో అదే ప్రయోగాన్ని తిరిగి నిర్వహించగా అంత సంక్లిష్టమైన రసాయన మిశ్రమాలు పుట్టుకు రాకపోవటమే దీనికి నిదర్శనం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని