అక్కడికక్కడే హైడ్రోజన్‌

పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే దిశగా హైడ్రోజన్‌ వాడకం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. కాకపోతే దీన్ని తయారుచేసి, తరలించటమే కాస్త కష్టమైన పని. ఇలాంటి ఇబ్బందిని తొలగించే ఉద్దేశంతోనే ఐఐటీ వారణాసి కొత్తరకం పరికరాన్ని

Updated : 08 Dec 2021 06:29 IST

ర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే దిశగా హైడ్రోజన్‌ వాడకం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. కాకపోతే దీన్ని తయారుచేసి, తరలించటమే కాస్త కష్టమైన పని. ఇలాంటి ఇబ్బందిని తొలగించే ఉద్దేశంతోనే ఐఐటీ వారణాసి కొత్తరకం పరికరాన్ని తయారు చేసింది. ఇది మెథనాల్‌ నుంచి అక్కడి కక్కడే హైడ్రోజన్‌ను తయారు చేయటం విశేషం. మెంబ్రేన్‌ టెక్నాలజీతో పని చేస్తుంది. దీని ద్వారా ఉత్పత్తి అయిన హైడ్రోజన్‌ను ఫ్యూయెల్‌ సెల్‌ సాయంతో విద్యుత్తు తయారీకి వినియోగించుకోవచ్చు. విద్యుత్తు వాహనాల ఛార్జింగుకు వాడుకోవచ్చు. మొబైల్‌ టవర్లకు అవసరమైన విద్యుత్తునూ అందించొచ్చు. ఈ పరికరాన్ని పెట్రోలు పంపులోనూ అమర్చొచ్చు. దీంతో హైడ్రోజన్‌ను నడిచే వాహనాల్లో అక్కడికక్కడే ఇంధనాన్ని నింపొచ్చు. దీన్ని పూర్తిగా మనదేశంలోనే తయారు చేయటం గమనార్హం. ఇందులో వాడిన పరికరాలన్నింటినీ ఐఐటీ వారణాసిలోనే రూపొందించారు. మన దేశంలో ఇలాంటి మొట్టమొదటి వ్యవస్థ ఇదే. ఈ పరికరానికి రెండు చదరపు మీటర్ల స్థలం ఉంటే చాలు. ఇది కేవలం 0.6 లీటర్ల/హెచ్‌ఆర్‌ మెథనాల్‌తో సుమారు 900 లీటర్ల/హెచ్‌ఆర్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. మనదేశంలో హైడ్రోజన్‌ ఇంధనం వాడకంపై గల అభిప్రాయాలను, ఇబ్బందులను ఈ పరికరం పూర్తిగా మార్చేయగలదని ఐఐటీ వారణాసి డైరెక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ జైన్‌ పేర్కొంటున్నారు. ఒక్క పరిశోధన రంగంలోనే కాదు, వ్యక్తిగత అవసరాల విషయంలోనూ ఇది మేలి మలుపు కాగలదని ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని