7000000000000000000000000000 అణువులు

మన శరీరంలో మొత్తం ఎన్ని అణువులు ఉన్నాయో తెలుసా? సుమారు 700 కోట్ల కోట్ల కోట్ల కోట్లు (7 ఆక్టిలియన్లు)! వీటి సంఖ్య బరువును బట్టి మారిపోవచ్చు.

Updated : 15 Dec 2021 05:35 IST

న శరీరంలో మొత్తం ఎన్ని అణువులు ఉన్నాయో తెలుసా? సుమారు 700 కోట్ల కోట్ల కోట్ల కోట్లు (7 ఆక్టిలియన్లు)! వీటి సంఖ్య బరువును బట్టి మారిపోవచ్చు. సాధారణంగా చిన్నవారిలో తక్కువ అణువులుంటాయి. పెద్దవారిలో కాస్త ఎక్కువగా ఉంటాయి. సగటున మన శరీంలో 87% వరకూ హైడ్రోజన్‌ లేదా ఆక్సిజన్‌ అణువులే ఉంటాయి. వీటికి కార్బన్‌, నైట్రోజన్‌ అణువులనూ కలిపితే  మొత్తం 90% ఇవే ఆక్రమిస్తాయి. మనలో చాలామందిలో 41 రసాయన మూలకాలుంటాయి. తక్కువ మోతాదులో ఉండే (ట్రేస్‌) మూలకాల అణువుల కచ్చితమైన సంఖ్య వయసు, ఆహారం, పర్యావరణాల మీద ఆధారపడి ఉంటుంది. శరీరంలో జరిగే రసాయన చర్యలకు ఇవి అవసరం. కానీ కొన్ని మూలకాలు.. సీసం, యురేనియం, రేడియం వంటివి ఎలాంటి పనుల్లోనూ పాల్గొనవు. పైగా విషతుల్యాలు కూడా. ఇవి శరీరంలో సహజంగానే స్వల్ప స్థాయిలో ఉంటాయి. కానీ ఎలాంటి హాని చేయవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు