చంద్రుడిపై ఫ్లయింగ్‌ సాసర్‌

చంద్రుడి మీద తిరిగే భవిష్యత్‌ రోవర్లు ఫ్లయింగ్‌ సాసర్ల మాదిరిగా ఉంటాయా? మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకుల తాజా అంతరిక్ష వాహన నమూనాను చూస్తే ఔననే అంటారు. ఇది మామూలు రోవర్లలా చక్రాల ....

Published : 05 Jan 2022 00:35 IST

చంద్రుడి మీద తిరిగే భవిష్యత్‌ రోవర్లు ఫ్లయింగ్‌ సాసర్ల మాదిరిగా ఉంటాయా? మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకుల తాజా అంతరిక్ష వాహన నమూనాను చూస్తే ఔననే అంటారు. ఇది మామూలు రోవర్లలా చక్రాల మీద కదలదు. చంద్రుడి ఉపరితలం మీది సహజ విద్యుత్‌ క్షేత్రాన్ని ఉపయోగించుకొని తేలియాడుతుంది. అంటే ఫ్లయింగ్‌ సాసర్‌లా తేలుతూ కదులుతుందన్నమాట. చంద్రుడు, గ్రహశకలాల వంటి ఖగోళ వస్తువుల మీద గాలి, వాతావరణం ఉండవు. అందువల్ల అక్కడ సౌర గాలి దిశ మారదు. సూర్యుడు, చుట్టుపక్కల ప్లాస్మా ప్రభావం నేరుగా పడటం వల్ల వీటి ఉపరితలాల మీద అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి. వీటినే ఫ్లయింగ్‌ సాసర్‌ అనువుగా వాడుకుంటుంది. చిన్న అయాన్‌ బీమ్స్‌తో ఛార్జ్‌ అయ్యే ఇది చంద్రుడి ఉపరితల సహజ విద్యుదావేశ శక్తినీ ఇనుమడింపజేస్తుంది. ఈ రెండింటి మధ్య పుట్టుకొచ్చే వికర్షణ బలంతో తేలియాడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని