వెచ్చటి స్మార్ట్‌ డేరా

అదో డేరా. విద్యుత్తు లేకపోయినా వెచ్చదనం కల్పిస్తుంది. శత్రువులు దూరంలో ఉండగానే గమనించటానికీ వీలు కల్పిస్తుంది. ఇలాంటి ప్రయోగాత్మక స్మార్ట్‌ డేరానే రూపొందించారు మీరట్‌లోని ఎంఐఈటీ ఇంజినీరింగ్‌ కళాశాలలోని అటల్‌ కమ్యూనిటీ ఇన్నోవేషన్‌ సెంటర్‌కు చెందిన విద్యార్థి. పేరు శ్యామ్‌ చౌరసియా

Updated : 11 May 2022 18:36 IST

అదో డేరా. విద్యుత్తు లేకపోయినా వెచ్చదనం కల్పిస్తుంది. శత్రువులు దూరంలో ఉండగానే గమనించటానికీ వీలు కల్పిస్తుంది. ఇలాంటి ప్రయోగాత్మక స్మార్ట్‌ డేరానే రూపొందించారు మీరట్‌లోని ఎంఐఈటీ ఇంజినీరింగ్‌ కళాశాలలోని అటల్‌ కమ్యూనిటీ ఇన్నోవేషన్‌ సెంటర్‌కు చెందిన విద్యార్థి. పేరు శ్యామ్‌ చౌరసియా. మంచు ప్రాంతాల్లో సైనికులకు చలి పెట్టకుండా, భద్రంగా ఉండేలా చూడాలనే ఉద్దేశంతోనే దీన్ని తయారుచేశారు. మంచు ప్రాంతాల్లో ఎండ కాయదు. విద్యుత్తు సరఫరా కూడా కష్టమే. అందుకే దీనిలోని హీటర్‌ ఛార్జర్‌ను వినూత్నంగా రూపొందించారు. ఇది రొటేడెట్‌ ఛార్జర్‌తో ఛార్జ్‌ అవుతుంది. దీన్ని చేతులతో తిప్పితే చాలు. బ్యాకప్‌ కోసం బ్యాటరీ కూడా ఉంటుంది. ఛార్జర్‌ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్తును ఇందులో నిల్వ చేసుకోవచ్చు. డేరాలో హైటెక్‌ సెన్సర్లు సైతం ఉంటాయి. వీటిని డేరా చుట్టూరా నేలలో పాతరల రూపంలో అమర్చాల్సి ఉంటుంది. ఇవి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల కదలికలను సైతం పసిగట్టగలవు. రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా లోపలికి సమాచారాన్ని చేరవేసి, సైనికులు వెంటనే అప్రమత్తమయ్యేలా చేస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని