స్టీలు టైర్లు!

ఆకారంలో, నిర్మాణంలో టైర్లు మొదట్నుంచీ పెద్దగా మారిందేమీ లేదు. అంతమాత్రాన కొత్తరూపం రాదనుకోవటానికి లేదు. దీనికి ఉదాహరణే అమెరికాలోని గ్లోబల్‌ ఎయిర్‌ సిలిండర్‌ వీల్స్‌ అనే అంకుర సంస్థ రూపొందించిన వినూత్న చక్రం. దీని పేరు ఎయిర్‌ సస్పెన్షన్‌ వీల్‌. ప్రధానంగా స్టీలుతోనే తయారుచేయటం వల్ల దీర్ఘకాలం మన్నుతుంది.

Updated : 19 Jan 2022 05:38 IST

ఆకారంలో, నిర్మాణంలో టైర్లు మొదట్నుంచీ పెద్దగా మారిందేమీ లేదు. అంతమాత్రాన కొత్తరూపం రాదనుకోవటానికి లేదు. దీనికి ఉదాహరణే అమెరికాలోని గ్లోబల్‌ ఎయిర్‌ సిలిండర్‌ వీల్స్‌ అనే అంకుర సంస్థ రూపొందించిన వినూత్న చక్రం. దీని పేరు ఎయిర్‌ సస్పెన్షన్‌ వీల్‌. ప్రధానంగా స్టీలుతోనే తయారుచేయటం వల్ల దీర్ఘకాలం మన్నుతుంది. చిరిగిపోదు. మరమ్మతు అవసరముండదు. వాహనంతో పాటు చక్రం శాశ్వతంగా ఉండిపోవాలనే ఉద్దేశంతోనే దీన్ని తయారుచేశారు. రబ్బరు టైర్లు నేలకు గట్టిగా పట్టుకొని ఉంటాయి. కుదుపులను తీసుకుంటాయి. మరి స్టీలు చక్రాలు జారిపోతాయేమో? ఇలాంటి ఇబ్బందిని తప్పించటానికి వీటికి ఎయిర్‌ సస్పెన్షన్‌ వ్యవస్థను జోడించారు. ఇది రోడ్డుకు స్టీలు చక్రం గట్టిగా పట్టుకొని ఉండేలా చేస్తుంది. గట్టిగా ఉండే స్టీలు తాకిడికి రోడ్లు పాడవుతాయేమో? అందుకే వీటిని ప్రస్తుతానికి గనుల వరకే పరిమితం చేస్తున్నారు. ఏదేమైనా టైర్ల స్వరూపం మారబోతోందనటానికిదో నిదర్శనం. రోడ్లు పాడవకుండా మార్పులు చేయగలిగితే మున్ముందు అన్నిచోట్లా అందుబాటులోకి రావచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని