షార్క్‌ చేపలే స్క్రబ్‌ బ్రష్షులైతే?

అపాయాన్ని ఉపాయంతో దాటటం చేపలకు బాగా తెలుసు. ఆ మాటకొస్తే అపాయాన్ని సైతం తమకు అనువుగానూ ఉపయోగించుకోగలవు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. తమను అమాంతం మింగేస్తాయని తెలిసినా కొన్ని రకాల చేపలు షార్క్‌ చేపలకు చాలా దగ్గరగా మసలుతున్నట్టు కనుగొన్నారు.

Updated : 19 Jan 2022 05:30 IST

అపాయాన్ని ఉపాయంతో దాటటం చేపలకు బాగా తెలుసు. ఆ మాటకొస్తే అపాయాన్ని సైతం తమకు అనువుగానూ ఉపయోగించుకోగలవు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. తమను అమాంతం మింగేస్తాయని తెలిసినా కొన్ని రకాల చేపలు షార్క్‌ చేపలకు చాలా దగ్గరగా మసలుతున్నట్టు కనుగొన్నారు. శత్రువులకు అంత దగ్గరగా వెళ్లటమెందుకు? కోరి అపాయాన్ని కొని తెచ్చుకోవటమెందుకని అనుకుంటున్నారా? చేపలు అంత తెలివి తక్కువవేమీ కావు. ఇవి షార్క్‌లను స్క్రబ్‌ బ్రష్షులుగా వాడుకుంటున్నాయి మరి. షార్క్‌ చేపలకు తమ శరీరాన్ని రుద్దుతూ చికాకు పెట్టే పరాన్నజీవుల వంటి వాటిని వదిలించుకుంటున్నాయి. ఈ విషయం ఇంతకుముందే తెలిసినా ఏయే చేపలు, ఎక్కడెక్కడ, ఎంత తరచుగా ఇలాంటి సాహసానికి పూనుకుంటున్నాయో తెలుసుకోవాలని యూనివర్సిటీ ఆఫ్‌ మియామీ పరిశోధకులు అనుకున్నారు. డ్రోన్ల సాయంతో రంగంలోకి దిగి బోలెడంత సమాచారం సేకరించారు. దాదాపు 12 చేప జాతులు గ్రేట్‌ వైట్‌ షార్క్‌, సిల్కీ షార్క్‌ల గరుకు చర్మాన్ని స్క్రబ్‌ బ్రష్షులుగా ఉపయోగించుకుంటున్నట్టు తేల్చారు. పైగి ఇవి విడివిడిగా కాకుండా గుంపులుగా వచ్చి శరీరాన్ని శుభ్ర పరచుకోవటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు