15 సెకండ్లలోనే రక్తం కట్టు!

గాయాలు, శస్త్రచికిత్సల వంటి అత్యవసర పరిస్థితుల్లో త్వరగా రక్తస్రావాన్ని అరికట్టటం చాలా ముఖ్యం. కుట్లు వేయటానికి కొంత సమయం పడుతుంది. మరి వెంటనే రక్తాన్ని ఆపాలంటే? ఇందుకోసమే మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు

Updated : 26 Jan 2022 05:41 IST

గాయాలు, శస్త్రచికిత్సల వంటి అత్యవసర పరిస్థితుల్లో త్వరగా రక్తస్రావాన్ని అరికట్టటం చాలా ముఖ్యం. కుట్లు వేయటానికి కొంత సమయం పడుతుంది. మరి వెంటనే రక్తాన్ని ఆపాలంటే? ఇందుకోసమే మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు కొత్త జిగురు రూపొందించారు. ఇది రక్తం ఉన్నా ఉపరితలాలకు అంటుకుంటుంది. కేవలం 15 సెకండ్లలో గట్టిగా బిగుసుకుంటుంది! దీని తయారీకి పీతల జాతికి చెందిన బానకుల్స్‌ జీవులే స్ఫూర్తి. సముద్రంలో నివసించే ఇవి జిగురు పదార్థం సాయంతో రాళ్లకు అంటుకుంటాయి. అప్పుడప్పుడు తిమింగలాలు, సముద్ర పాముల వంటి వాటికీ అతుక్కొని జీవిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని