ష్‌.. ష్‌.. రెక్కలు!

పట్టణాల్లో శబ్ద కాలుష్యం పెద్ద సమస్య. విమానాలు, డ్రోన్ల వంటి వాటిల్లోని రెక్కలతో కూడిన ఇంజిన్ల నుంచి వచ్చే చప్పుడూ బాగానే ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇలాంటి మర ఇంజిన్ల నుంచి వెలువడే శబ్దాన్ని తగ్గించటానికి చైనా శాస్త్రవేత్తలు వినూత్న

Published : 02 Feb 2022 01:17 IST

ట్టణాల్లో శబ్ద కాలుష్యం పెద్ద సమస్య. విమానాలు, డ్రోన్ల వంటి వాటిల్లోని రెక్కలతో కూడిన ఇంజిన్ల నుంచి వచ్చే చప్పుడూ బాగానే ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇలాంటి మర ఇంజిన్ల నుంచి వెలువడే శబ్దాన్ని తగ్గించటానికి చైనా శాస్త్రవేత్తలు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం గుడ్లగూబ రెక్కలు వంక చూస్తుండటం గమనార్హం. గుడ్లగూబలు రాత్రిపూటే వేటాడతాయి. ఇవి పక్షులంత వేగంగా ఎగిరినా సుమారు 18 డెసిబెల్స్‌ తక్కువ శబ్దాన్ని వెలువరిస్తాయి. ఎర దగ్గరకు వచ్చేంతవరకూ అసలు చప్పుడే కాదు. దీనికి కారణం గుడ్లగూబ రెక్కల ప్రత్యేకతే. వీటి రెక్కల చివర్లు రంపం మాదిరిగా ఎగుడుదిగుడుగా ఉంటాయి. ఇవి అధిక ఫ్రీక్వెన్సీతో కూడిన, సుడులు తిరిగే గాలులను అస్తవ్యవస్తం చేసి గాలి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. నెమ్మదిగా ప్రవహించేలా చేస్తాయి. దీంతో చప్పుడు అంతగా కాదు. అందుకే వీటి స్ఫూర్తితో శాస్త్రవేత్తలు మర డిజైన్లను కొత్తగా రూపొందించటంపై దృష్టి సారించారు. గిరగిరా తిరిగే టర్బో యంత్రాల డిజైన్‌ క్రమంగా మారుతూ వస్తున్నా చప్పుడు తగ్గించటం ఇప్పటికీ సవాలుగానే నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వెనక వైపు చివర్లు ఎగుడుదిగుడుగా ఉండేలా మరల రెక్కలను నిర్మించాలని భావిస్తున్నారు. దీంతో చప్పుడు బాగా తగ్గుతుందని ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని