చీమలు.. క్యాన్సర్‌నూ పట్టేస్తాయి!

వాసన విషయంలో శునకాల శక్తి తెలిసిందే. నేరగాళ్లనే కాదు, సుమారు 97% కచ్చితత్వంతో ఊపిరితిత్తుల క్యాన్సర్‌నూ పోల్చుకోగలవని ఇటీవల బయటపడింది. అయితే ఇందుకోసం కుక్కలకు శిక్షణ ఇవ్వటం...

Updated : 12 Aug 2022 15:08 IST

వాసన విషయంలో శునకాల శక్తి తెలిసిందే. నేరగాళ్లనే కాదు, సుమారు 97% కచ్చితత్వంతో ఊపిరితిత్తుల క్యాన్సర్‌నూ పోల్చుకోగలవని ఇటీవల బయటపడింది. అయితే ఇందుకోసం కుక్కలకు శిక్షణ ఇవ్వటం చాలా కష్టమైన పని. ఎక్కువ సమయం పడుతుంది. ఖర్చూ ఎక్కువే. అందుకే ఫ్రాన్స్‌ పరిశోధకులు ఇతర జీవులపై దృష్టి సారించారు. ఇక్కడే వీరిని చీమలు బాగా ఆకట్టుకున్నాయి. చీమల వంటి కీటకాలు మనుగడ సాగించటానికి ఘ్రాణశక్తి అత్యంత కీలకం. తినగలిగే ఆహారాన్ని, తమ జతను కనుక్కోవటానికి ఇవి వాసన మీదే ఆధారపడతాయి. వీటికి క్యాన్సర్‌ను పసిగట్టేలా శిక్షణ ఇస్తే? అనుకోవటమే తరువాయి. ఫార్మికా ఫుస్కా అనే రకం చీమలకు శిక్షణ ఆరంభించేశారు క్యాన్సర్‌ వాసనను గుర్తించినప్పుడల్లా చక్కెర పానీయాన్ని నోటికి అందించారు. ఇలా 30 నిమిషాల్లోనే చీమలు క్యాన్సర్‌ నమూనాలను గుర్తించేలా తీర్చిదిద్దారు. తర్వాత వీటి జ్ఞాపకశక్తికీ పరీక్ష పెట్టారు. చక్కెర పానీయం కోసం ఇవి తప్పనిసరిగా క్యాన్సర్‌ కణాలను వెతికేలా చేశారు. దీంతో క్యాన్సర్‌ను పసిగట్టటం నేర్చుకున్నాయి. అనంతరం పలు రకాల క్యాన్సర్లనూ గుర్తించేలా తర్ఫీదిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని