చంద్రుడితో పాటే నీరు!

మన భూమి ప్రత్యేకతలే వేరు. ఒకపక్క పెద్దమొత్తంలో నీరు. మరోపక్క పరిమాణంతో చూస్తే అతిపెద్ద చంద్రుడు. భూమిని తన కక్ష్యలో స్థిరంగా ఉంచుతున్నవి ఇవే. భూమి ఏర్పడ్డదేమో పొడిగా

Updated : 30 Mar 2022 05:51 IST

మన భూమి ప్రత్యేకతలే వేరు. ఒకపక్క పెద్దమొత్తంలో నీరు. మరో పక్క పరిమాణంతో చూస్తే అతిపెద్ద చంద్రుడు. భూమిని తన కక్ష్యలో స్థిరంగా ఉంచుతున్నవి ఇవే. భూమి ఏర్పడ్డదేమో పొడిగా ఉన్న అంతర్‌ సౌర వ్యవస్థలో. మరి నీరు ఎక్కడ్నుంచి వచ్చింది? దీన్ని అర్థం చేసుకోవాలంటే 440 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఢీకొట్టిన గ్రహం గురించి తెలుసుకోవాలి. చంద్రుడు, నీరు ఏర్పడ్డది దీన్నుంచే మరి. అప్పట్లో అంగారకుడి సైజులో ఉన్న థీయా అనే గ్రహం భూమిని ఢీకొట్టింది. అప్పుడు ఎగిసిపడ్డ శకలాల్లో చాలాభాగం ఒకదగ్గరికి చేరి చంద్రుడిగా మారాయి. కొన్ని శకలాలేమో భూగర్భంలోకి చొచ్చుకెళ్లి, పైపొర దిగువ భాగంలో (మ్యాంటిల్‌) కలిసిపోయాయి. భూమికి సమీపంలో అంతర్‌ సౌరవ్యవస్థలోనే థీయా పుట్టుకొచ్చిందని మొదట్లో అనుకునేవారు. కానీ మ్యాంటిల్‌లోని మాలిబ్డినమ్‌ లోహం ఐసోటోప్‌లను విశ్లేషించగా ఇది సౌర మండలం ఆవలి నుంచి వచ్చినట్టు తేలింది. ఇదే పెద్దమొత్తంలో భూమికి నీటిని తీసుకొచ్చింది. అంటే చంద్రుడు, నీరు ఒకేసారి ఏర్పడ్డాయన్నమాట. అంటే ఇవే లేకపోతే భూమి మీద ప్రాణులు పుట్టేవే కాదన్నమాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని