నీటిలో మంచు వేడిని బట్టి కరుగు!

నీటి విపరీత సాంద్రత విచిత్ర ప్రభావాలకు దారితీస్తుంటుంది. దీని లోగుట్టును తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సాధారణంగా ద్రవాలు చల్లబడుతున్నకొద్దీ మరింతగా ఘనీభవిస్తుంటాయి.

Updated : 06 Apr 2022 16:05 IST

నీటి విపరీత సాంద్రత విచిత్ర ప్రభావాలకు దారితీస్తుంటుంది. దీని లోగుట్టును తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సాధారణంగా ద్రవాలు చల్లబడుతున్నకొద్దీ మరింతగా ఘనీభవిస్తుంటాయి. కానీ స్వచ్ఛమైన నీరు 4 డిగ్రీల సెల్షియస్‌ డిగ్రీల వద్ద అత్యంత ఎక్కువగా ఘనీభవిస్తుంది. అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతలో నీరు ఘనీభవించటం కాస్త తక్కువగా ఉంటుంది. ఉపరితలం ఎత్తు పెరుగుతుంది. దీని మూలంగానే నీటిలో మంచు ముక్కలు మునిగినప్పుడు, నీటి ఉష్ణోగ్రతను బట్టి మంచు మూడు వేర్వేరు రూపాల్లో కరుగుతున్నట్టు న్యూయార్క్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. స్వచ్ఛమైన నీటితో చేసిన మంచు స్థూపాలను 2 డిగ్రీల నుంచి 10 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతతో కూడిన నీటిలో ముంచి పరిశీలించారు. సుమారు 5 డిగ్రీల సెల్షియస్‌ కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో మంచు మృదువుగా కరిగి కిందికి చూస్తున్న సూదిలా మారింది. సుమారు 5 డిగ్రీల నుంచి 7 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతలో మంచు ఉపరితలం కొరుకులు కొరుకులుగా తయారైంది. ఇక 7 డిగ్రీల సెల్షియస్‌ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నీటిలో పైకి చూస్తున్న ముల్లు మాదిరిగా తయారైంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమని పరిశోధకులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని