చక్కిలిగిలి షూ!

ఒత్తిడితో బాధపడుతున్నారా? అయితే ఆ షూ ధరించాల్సిందే! ఎందుకంటే ఇవి పాదాలకు చక్కిలిగిలి పెట్టి నవ్వు తెప్పిస్తాయి మరి. చక్కిలిగిలి, నవ్వుతో ఒత్తిడి బాగా తగ్గుతుందని మానసిక శాస్త్ర అధ్యయనాలు చెబుతున్నాయి.

Updated : 06 Apr 2022 16:04 IST

త్తిడితో బాధపడుతున్నారా? అయితే ఆ షూ ధరించాల్సిందే! ఎందుకంటే ఇవి పాదాలకు చక్కిలిగిలి పెట్టి నవ్వు తెప్పిస్తాయి మరి. చక్కిలిగిలి, నవ్వుతో ఒత్తిడి బాగా తగ్గుతుందని మానసిక శాస్త్ర అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్‌లాండ్‌ శాస్త్రవేత్తలు పాదాలకు చక్కిలిగిలి పెట్టే వినూత్న పరికరాన్ని రూపొందించారు. బ్యాటరీతో నడిచే దీన్ని ఎలాంటి షూలోనైనా అమర్చుకోవచ్చు. దీన్ని తయారు చేయటానికి ముందు శాస్త్రవేత్తలు అయస్కాంతంతో కూడిన బ్రష్‌ల సాయంతో పాదాల్లో చక్కిలిగిలి పెట్టించి, ఎక్కడ చక్కిలిగిలి పెడితే ఎక్కువ నవ్వు వస్తుందో తెలుసుకున్నారు. మొత్తం మూడు చోట్లను గుర్తించారు. ఆడవారిలో పాదం వంపు మధ్యలో, మగవారిలో వేళ్ల వద్ద ఎక్కువ చక్కిలిగిలి పుడుతున్నట్టు తేలటం గమనార్హం. దీని ఆధారంగానే 3డీ ప్రింటింగ్‌ పద్ధతిలో ప్రత్యేక షూ సోల్‌ను తయారుచేశారు. దీనికి మూడు చోట్ల ఖాళీలుంటాయి. వీటిల్లోనే చక్కిలిగిలి పెట్టే పరికరాలు ఉంటాయి. ఇవి గిరగిరా తిరుగుతూ మెత్తటి బ్రష్‌తో చక్కిలిగిలి పెడతాయి. లిథియం అయాన్‌ బ్యాటరీలతో నడిచే ఇవి 60 నిమిషాల వరకు పనిచేస్తాయి. రిమోట్‌ ద్వారా ఆన్‌ ఆఫ్‌ చేసుకోవచ్చు. టీవీ చూస్తూనో, పుస్తకం చదువుతూనో ఈ షూ ధరిస్తే ఒకవైపు వినోదం పొందుతూనే మరోవైపు నవ్వులతో మునిగిపోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని