ఎవరెస్ట్‌ మీద వాతావరణం

వాతావరణ మార్పు ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాన్నీ వదలటం లేదు. దీని ప్రభావానికి ఈ శిఖరం మీదున్న హిమానీ నదాలు వేగంగా మంచును కోల్పోతుండటమే ఇందుకు నిదర్శనం.

Updated : 06 Apr 2022 16:04 IST

వాతావరణ మార్పు ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాన్నీ వదలటం లేదు. దీని ప్రభావానికి ఈ శిఖరం మీదున్న హిమానీ నదాలు వేగంగా మంచును కోల్పోతుండటమే ఇందుకు నిదర్శనం. ఎవరెస్ట్‌ మీద, సముద్ర మట్టానికి 8వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది ‘సౌత్‌ కల్‌’ హిమానీ నదం. తన మీద పోగుపడే మంచుతో పోలిస్తే ఇది సుమారు 80 రెట్లు ఎక్కువ వేగంతో మంచును కోల్పోతున్నట్టు తాజాగా బయటపడింది. ఈ హిమానీ నదం ఉపరితలంపై 2వేల సంవత్సరాలుగా పోగుపడిన మంచు 1990ల నుంచి పూర్తిగా కరిగిపోవటం గమనార్హం. ఇలా వేగంగా మంచు తగ్గిపోవటం ఎవరెస్ట్‌ మీదే కాదు, దీని చుట్టుపక్కల నివసించేవారి మీదా తీవ్ర ప్రభావం చూపించే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. మంచు కరగటం వల్ల మరింత ఎక్కువగా మంచు చరియలు విరిగిపడొచ్చని, లోపలి రాళ్లు పైకి తేలొచ్చని వివరిస్తున్నారు. సాధారణంగా హిమానీ నదాల ఉపరితలం మీదుండే మంచు సూర్య కిరణాలను ప్రతిఫలింప జేస్తుంది. ఇది క్షీణిస్తే కిందిభాగంలోని ముడి మంచు ఎండ ప్రభావానికి గురవుతుంది. దీంతో అది త్వరగా కరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని