మనిషిలా ఆలోచించే కృత్రిమ మేధ

‘నారింజ’ అనగానే మన మనసులో రెండు విషయాలు మెదలుతాయి. ఒకటి పండు, రెండు రంగు. మన మెదడు గొప్పతనం ఇది. దీన్ని కృత్రిమ మేధ (ఏఐ) అనుకరించేలా చేస్తే? మెటా (ఫేస్‌బుక్‌) ఇలాంటి పనే చేస్తోంది. మనిషి మెదడులా మాటలను,

Updated : 11 May 2022 18:30 IST

‘నారింజ’ అనగానే మన మనసులో రెండు విషయాలు మెదలుతాయి. ఒకటి పండు, రెండు రంగు. మన మెదడు గొప్పతనం ఇది. దీన్ని కృత్రిమ మేధ (ఏఐ) అనుకరించేలా చేస్తే? మెటా (ఫేస్‌బుక్‌) ఇలాంటి పనే చేస్తోంది. మనిషి మెదడులా మాటలను, పదాలను విశ్లేషించి, అర్థం చేసుకోగల అధునాతన ఏఐ వ్యవస్థను రూపొందిస్తోంది. ఇందుకోసం మెటా రెండేళ్లుగా న్యూరో-ఇమేజింగ్‌కు డీప్‌ లెర్నింగ్‌ పద్ధతులను వర్తింపజేస్తూ కొత్త ప్రయోగాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ భాషా నమూనాలు చాలావరకు తర్వాత వచ్చే పదాన్ని మాత్రమే అంచనా వేస్తుంటాయి. కానీ మన మెదడు మాత్రం ఒక పదం తర్వాత వచ్చే పదాలనే కాదు.. సంక్లిష్ట భావనలను, సారాంశాలను, విశ్లేషణలనూ అంచనా వేయగలదు. దీని గుట్టును ఛేదించగలిగితే అధునాతన ఏఐ భాషా నమూనాలు ఎంతగానో మెరుగవుతాయి. మెటా ఉద్దేశమూ ఇదే. మెదడులో సుదీర్ఘ శ్రేణి అంచనాలకు కారణమవుతున్న భాగాలను మెటా ఇటీవల బయటపెట్టింది. వీటి ఆధారంగానే మనిషిలా పదాలను, మాటలను విడమరచుకునే ఏఐ భాషా వ్యవస్థను తయారుచేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే కృత్రిమ మేధ సాయంతో వాక్యంలో తర్వాత వచ్చే పదాలను మాత్రమే కాకుండా భావాలను, ఉద్దేశాలను అంచనా వేయటమూ సులభమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని