అక్కడి పక్షులకు రంగులెక్కువ!

భూమధ్యరేఖకు సమీపంలో నివసించే పక్షులు మరిన్ని ఎక్కువ రంగులతో శోభిస్తాయి. ధ్రువాల వద్దకు వెళ్తున్నకొద్దీ పక్షుల రంగు వెలిసి పోతుంటుంది. లేదూ రంగు ముదురుతూ వస్తుంది. అప్పుడెప్పుడో రెండు శతాబ్దాల కిందట చార్లెస్‌ డార్విన్‌ ప్రతిపాదించిన పక్షి రంగు సిద్ధాంతమిది.

Published : 25 May 2022 01:09 IST

భూమధ్యరేఖకు సమీపంలో నివసించే పక్షులు మరిన్ని ఎక్కువ రంగులతో శోభిస్తాయి. ధ్రువాల వద్దకు వెళ్తున్నకొద్దీ పక్షుల రంగు వెలిసి పోతుంటుంది. లేదూ రంగు ముదురుతూ వస్తుంది. అప్పుడెప్పుడో రెండు శతాబ్దాల కిందట చార్లెస్‌ డార్విన్‌ ప్రతిపాదించిన పక్షి రంగు సిద్ధాంతమిది. అది నిజమేనని కృత్రిమమేధ సాయంతో నిర్వహించిన తాజా అధ్యయనం తీర్మానించింది. ఇందులో భాగంగా అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నేషనల్‌ హిస్టరీ మ్యూజియంలోని 24,345 పక్షుల ఫొటోలను పరిశీలించారు. ధ్రువాల వద్ద నివసించే పక్షులతో పోలిస్తే భూమధ్యరేఖ వద్ద పక్షులు 30% ఎక్కువ వైవిధ్య భరిత రంగులను కలిగుంటున్నట్టు గుర్తించారు. 19వ శతాబ్దంలోనూ కొందరు శాస్త్రవేత్తలు డార్విన్‌లాంటి భావనలనే వ్యక్తం చేసినప్పటికీ నిరూపించలేకపోయారు. తాజా అధ్యయనంతో శాస్త్రీయంగా రుజువై నట్టయ్యింది. మగ పక్షుల కన్నా ఆడ పక్షుల్లో వర్ణ వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం. జీవ వైవిధ్యాన్ని మరింత బాగా అర్థం చేసుకోవటానికిది ఉపయోగపడగలదని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని