టైర్లు నల్లగా ఎందుకు?

కారు కొనేటప్పుడు ఇష్టమైన రంగేదో చూస్తాం. కానీ టైర్ల విషయంలో రంగు ఎంచుకోవటం కుదరదు. అన్నీ నల్లగానే ఉంటాయి. ఇంతకీ ఇవి నల్లగా ఎందుకుంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా? బురద వంటివి అంటుకుంటే మురికి కనిపించకుండా ఉండటానికని చాలామంది

Published : 01 Jun 2022 09:26 IST

కారు కొనేటప్పుడు ఇష్టమైన రంగేదో చూస్తాం. కానీ టైర్ల విషయంలో రంగు ఎంచుకోవటం కుదరదు. అన్నీ నల్లగానే ఉంటాయి. ఇంతకీ ఇవి నల్లగా ఎందుకుంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా? బురద వంటివి అంటుకుంటే మురికి కనిపించకుండా ఉండటానికని చాలామంది భావిస్తుంటారు. అసలు విషయం అదికాదు. నిజానికి మొదట్లో టైర్లు తెల్లగా ఉండేవి. రబ్బరు సహజ రంగు అదే మరి. 1912 తర్వాతే టైర్లకు నల్లరంగు వచ్చింది. దీనికి కారణం రబ్బరుకు స్థిరత్వాన్ని కలిగించేందుకు ‘కార్బన్‌ బ్లాక్‌’ను జోడించటం. దీంతో టైర్లు దృఢంగా తయారయ్యాయి. మన్నిక పెరిగింది. వాహనాలు నడుస్తున్నప్పుడు టైరు, రోడ్డు మధ్య ఘర్షణ తగ్గటానికీ కార్బన్‌ బ్లాక్‌ తోడ్పడుతుంది. ఫలితంగా వేడి పుట్టటమూ తగ్గుతుంది. అతి నీలలోహిత కాంతి, ఓజోన్‌ల ప్రభావంతో టైర్లు దెబ్బతినకుండానూ కార్బన్‌ కాపాడుతుంది. అప్పట్లో టైర్లు నల్లగా ఉండటం ఎవరికీ నచ్చేది కాదు. కానీ కార్లు వివిధ రంగుల్లో తయారయ్యాక నల్ల టైర్లకు ఆకర్షణ పెరిగింది. నలుపు ఏ రంగు మీదైనా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని