అంగారకుడి ఇటుకలు గట్టివే!

చంద్రుడు, అంగారకుడి మీద దుమ్ము, రాళ్ల పొడి ఉంటాయి. వీటిని రెగోలిత్‌ అంటారు. మరి వీటితో ఇటుకలను తయారుచేస్తే గట్టిగా ఉంటాయా? భవిష్యత్తులో అక్కడ నిర్మాణాలు చేపడితే బరువును తట్టుకుంటాయా? యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ ఫ్లోరిడాకు....

Published : 15 Jun 2022 00:16 IST

చంద్రుడు, అంగారకుడి మీద దుమ్ము, రాళ్ల పొడి ఉంటాయి. వీటిని రెగోలిత్‌ అంటారు. మరి వీటితో ఇటుకలను తయారుచేస్తే గట్టిగా ఉంటాయా? భవిష్యత్తులో అక్కడ నిర్మాణాలు చేపడితే బరువును తట్టుకుంటాయా? యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ ఫ్లోరిడాకు చెందిన రణజయ్‌ ఘోష్‌, బృందానికి ఇలాంటి అనుమానమే వచ్చింది. అచ్చం రెగోలిత్‌ను పోలిన కృత్రిమ పదార్థాలపై ప్రయోగాలు ఆరంభించారు. ముందు ఈ పదార్థాలకు ఉప్పు, నీరు కలిపారు. తర్వాత ఈ మిశ్రమంతో 3డీ ముద్రణ పద్ధతిలో ఇటుకలను పోత పోశారు. వీటిని వివిధ ఉష్ణోగ్రతల్లో కాల్చారు. తర్వాత పెద్ద పెద్ద బరువులను మోపి పరీక్షించారు. కొన్ని ఇటుకలు విరిగిపోయినా 1200 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద కాల్చినవి మాత్రం దృఢంగా.. మామూలుగా మట్టితో చేసే ఇటుకల కన్నా గట్టిగా ఉంటున్నట్టు గుర్తించారు. కొన్ని ఇటుకలు సుమారు 2.5 కోట్ల పాస్కల్స్‌.. అంటే భూమి మీద వాతావరణ పీడనం కన్నా 250 రెట్లు ఎక్కువ ఒత్తిడిని తట్టుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని