వెంట్రుకంత బ్యాక్టీరియా!

బ్యాక్టీరియా అతి సూక్ష్మంగా ఉంటుంది. మైక్రోస్కోప్‌తో తప్ప చూడలేం. మరి కంటికి కనిపించేంత పెద్దగా ఉంటే? ఇటీవల యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్రెంచ్‌ వెస్టిండీస్‌ అండ్‌ గయానా శాస్త్రవేత్తలు అలాంటి బ్యాక్టీరియానే గుర్తించారు.

Updated : 29 Jun 2022 03:43 IST

బ్యాక్టీరియా అతి సూక్ష్మంగా ఉంటుంది. మైక్రోస్కోప్‌తో తప్ప చూడలేం. మరి కంటికి కనిపించేంత పెద్దగా ఉంటే? ఇటీవల యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్రెంచ్‌ వెస్టిండీస్‌ అండ్‌ గయానా శాస్త్రవేత్తలు అలాంటి బ్యాక్టీరియానే గుర్తించారు. ఇది సుమారు కనురెప్ప వెంట్రుకంత సైజులో ఉండటం ఆశ్చర్యకరం. అంగుళంలో మూడో వంతు (0.9 సెంటీమీటర్లు) పొడవు ఉన్న దీన్ని కరేబియన్‌ దీవుల్లో నీటిలో మునిగి ఉన్న చెట్ల కొమ్మల మీద కనుగొన్నారు. ఇప్పటివరకు మనకు తెలిసిన బ్యాక్టీరియాలో ఇదే అతి పెద్దది. అందుకే దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాక్టీరియాగా భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు దీనికి పెట్టిన పేరు థియోమార్గరిటా మ్యాగ్నిఫికా. అంటే మహా సల్ఫర్‌ ముత్యం అని అర్థం. మొదట్లో దీన్ని బ్యాక్టీరియా అని అనుకోలేదు. జన్యు విశ్లేషణ చేసిన తర్వాతే ఏక కణంతో కూడిన బ్యాక్టీరియా అని బయటపడింది. ఇలాంటి పెద్ద బ్యాక్టీరియా రకాలు ఇంకా ఎన్ని ఉన్నాయో అనే ప్రశ్నను ఇది  రేకెత్తించిందని, బ్యాక్టీరియాను తక్కువగా అంచనా వేయటం తగదనే సంగతిని గుర్తుచేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే ప్రయోగశాలలో దీన్ని వృద్ధి చేయలేకపోయారు. దీని కణ నిర్మాణం విభిన్నంగానూ ఉంది. కీలకమైన తేడా ఏంటంటే- మధ్యలో పెద్ద భాగం ఉండటం. కణం అంతటా కాకుండా ఇందులోనే కణ సంబంధ పనులన్నీ జరుగుతుండటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని