అతి స్పష్టంగా నక్షత్రాల సముదాయం

అది 1877. ఫ్రాన్స్‌లోని మార్సిలే అబ్జర్వేటరీ. దీనికి ఖగోళ శాస్త్రవేత్త ఎడొవర్డ్‌ జీన్‌ మారీ స్టీఫన్‌ సంచాలకుడిగా వ్యవహరిస్తున్న సమయం. అబ్జర్వేటరీని అధునాతనంగా తీర్చిదిద్దే క్రమంలో ఆయన మొదట్లో పెద్దగా ఆవిష్కరణల మీద దృష్టి సారించలేదు. కానీ రాన్రానూ గ్రహశకలాల వంటి బోలెడు విషయాలను

Updated : 20 Jul 2022 03:05 IST

ది 1877. ఫ్రాన్స్‌లోని మార్సిలే అబ్జర్వేటరీ. దీనికి ఖగోళ శాస్త్రవేత్త ఎడొవర్డ్‌ జీన్‌ మారీ స్టీఫన్‌ సంచాలకుడిగా వ్యవహరిస్తున్న సమయం. అబ్జర్వేటరీని అధునాతనంగా తీర్చిదిద్దే క్రమంలో ఆయన మొదట్లో పెద్దగా ఆవిష్కరణల మీద దృష్టి సారించలేదు. కానీ రాన్రానూ గ్రహశకలాల వంటి బోలెడు విషయాలను గుర్తించారు. వీటిల్లో అన్నింటికన్నా ముఖ్యమైంది ఐదు నక్షత్ర మండలాల సముదాయం. దీన్ని ప్రస్తుతం ఆయన పేరు మీదే ‘స్టీఫన్‌ క్వింటెట్‌’ అని పిలుచుకుంటున్నారు. దీని గురించి ఇప్పుడెందుకని అనుకుంటున్నారా? నాసాకు చెందిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ ఇటీవల ఈ నక్షత్ర మండల సముదాయానికి సంబంధించి మునుపెన్నడూ చూడలేని అద్భుత దృశ్యాలను చిత్రీకరించింది. ఇప్పటివరకు జేమ్స్‌ వెబ్‌ తీసిన అదిపెద్ద చిత్రం ఇదే. సుమారు వెయ్యి వేర్వేరు ఫొటోలను సమ్మిళితం చేసి కూర్చిన ఇది 15 కోట్లకు పైగా పిక్సెల్స్‌తో కూడుకొని ఉండటం విశేషం. అత్యంత శక్తిమంతమైన ఇన్‌ఫ్రారెడ్‌ విజన్‌తో వెబ్‌ టెలిస్కోప్‌ తీస్తున్న ఫొటోలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని