Published : 27 Jul 2022 00:44 IST

బంగాళామోటో!

వంటకాల్లో బంగాళా దుంపలు, టమోటాలకు ఉన్న ఆదరణే వేరు. ఒకటేమో దుంప, మరోటి కాయ. కానీ ఈ రెండింటినీ ఒకే మొక్కకు కాయించొచ్చని తెలుసా? వారణాసిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెజిటేబుల్‌ రీసెర్చ్‌ (ఐఐవీఆర్‌) పరిశోధకులు ఇలాంటి ఘనతనే సాధించారు. ఒకే మొక్కకు బంగాళాదుంప, టమోటాలను కాయించి ఔరా అనిపించారు. దీనికి పొటాటో, టమోటా పేర్లను కలిపి ‘పొమాటో’ అని నామకరణం చేశారు. మనం తెలుగులో దీన్ని బంగాళామోటో అని పిలుచుకోవచ్చేమో. నిజానికి దీన్ని గత సంవత్సరమే రూపొందించినా ఇప్పుడు నాణ్యత, దిగుబడిని పెంచటం మీద దృష్టి సారించారు. ఇదొక్కటే కాదు. బంగాళాదుంప మొక్కకు వంకాయను పండించటంలోనూ విజయం సాధించారు. దీన్ని ముద్దుగా ‘బ్రిటాటో’ అని పిలుచుకుంటున్నారు. ఈ మొక్కకు మిరపకాయలనూ పండించొచ్చు. ప్రతి బంగాళదుంప మొక్క 2 కిలోల టమోటాలు, 600 గ్రాముల బంగాళాదుంపలను ఇవ్వగలదు. నేల కింది పొరలో బంగాళాదుంపలు కాస్తే, పైన టమోటాలు కాస్తాయి. వంకాయలు, మిరపకాయలు పండించటానికి ఇలాగే అదనపు పొరలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ మొక్కలను ఇంట్లో కుండీల్లోనూ పెంచుకోవచ్చు. దోసకాయలు, కాకరకాయలు వంటివీ పండించాలని ప్రయత్నిస్తున్నారు. ఇవి పెద్దఎత్తున అందుబాటులోకి రావటానికి ఇంకాస్త సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts