ఆర్కిటిక్ వేడెక్కుతోంది నాలుగింతల వేగంగా
మన భూమి ఉష్ణోగ్రత రోజురోజుకీ పెరుగుతోంది. పారిశ్రామిక విప్లవం ఆరంభమైనప్పటితో పోలిస్తే సుమారు 1.1 డిగ్రీ సెల్షియస్ ఎక్కువ వేడితో రగులుతోంది. అయితే వేడెక్కే ప్రక్రియ అంతటా ఒకేలా లేదు. కొన్నిచోట్ల చాలా ఎక్కువ వేగంతో కొనసాగుతోంది.
మన భూమి ఉష్ణోగ్రత రోజురోజుకీ పెరుగుతోంది. పారిశ్రామిక విప్లవం ఆరంభమైనప్పటితో పోలిస్తే సుమారు 1.1 డిగ్రీ సెల్షియస్ ఎక్కువ వేడితో రగులుతోంది. అయితే వేడెక్కే ప్రక్రియ అంతటా ఒకేలా లేదు. కొన్నిచోట్ల చాలా ఎక్కువ వేగంతో కొనసాగుతోంది. అర్కిటిక్ ప్రాంతం ఇలాంటిదే. గత 43 ఏళ్లలో ఇది మిగతా ప్రపంచంతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ వేగంగా వేడెక్కినట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. ఎందుకంటే వాతావరణం సమతులంగా ఉండటానికి ఆర్కిటిక్ ప్రాంతం తోడ్పడుతుంది. ఇది దెబ్బతింటే విపరీత పరిణామాలకు దారితీస్తుంది. ఇంతకీ ఆర్కిటిక్ ఎందుకు వేడెక్కుతోంది? దీనికి చాలావరకు ఆర్కిటిక్ మహాసముద్ర మంచు కారణమని చెప్పుకోవచ్చు. ఇది సముద్రం మీద ఒక మీటరు నుంచి ఐదు మీటర్ల మందంతో పొరలా పరచుకొని ఉంటుంది. చలికాలంలో గడ్డ కడుతుంది. వేసవిలో కరుగుతుంది. ఇది సౌర వేడిలో 85 శాతాన్ని తిరిగి అంతరిక్షంలోకి మళ్లిస్తుంది. అదే మిగతా సముద్రాలైతే 90% వేడిని గ్రహించుకుంటాయి. మంచు పొరతో కప్పుకొని ఉన్నప్పుడు ఆర్కిటిక్ మహా సముద్రం అద్దంలా పనిచేస్తుంది. సౌర వేడిని వెనక్కి వెదజల్లుతుంది. అదే మంచు కరిగినప్పుడు వేడిని గ్రహించుకోవటం పెరుగుతుంది. దీంతో మంచు మరింత వేగంగానూ కరుగుతుంది. ఫలితంగా మహా సముద్రం ఇంకాస్త త్వరగానూ వేడెక్కుతుంది. ‘ఆర్కిటిక్ యాంప్లికేషన్’కు చాలావరకు కారణమిదే. దిగువ అక్షాంశాలతో పోలిస్తే ఆర్కిటిక్ మీద సమీప ఉపరితల గాలి ఉష్ణోగ్రతలో మార్పులు పెరగటాన్ని ఆర్కిటిక్ యాంప్లికేషన్ అంటారు. చాలావరకు దీని నిష్పత్తి సుమారు 2.5 వరకు ఉంటుందని భావిస్తుంటారు. అంటే ప్రపంచ సగటు కన్నా ఆర్కిటిక్ 2.5 రెట్లు ఎక్కువ వేగంగా వేడెక్కుతుందని అర్థం. అయితే ఆర్కిటిక్ యాంప్లికేషన్ నిష్పత్తి సుమారు 4 వరకు ఉంటోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
అయితే ఏంటి?
అక్కడెక్కడో అర్కిటిక్ ప్రాంతం వేడెక్కితే మనకేంటని అనుకోవటానికి లేదు. అక్కడ వేడి ప్రభావానికి విపరీతంగా స్పందించే ఇతర అంశాలూ ఉన్నాయి. వీటిల్లో ఒకటి శాశ్వతంగా గడ్డకట్టిన భూ ఉపరితలం పొర (పెర్మాఫ్రాస్ట్). ప్రతి వేసవిలో కరుగుతూ వస్తే దీనిలోని కార్బన్ వాతావరణంలోకి విడుదలవుతుంది. పెర్మాఫ్రాస్ట్‌లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతను 3 డిగ్రీల సెల్షియస్ కన్నా ఎక్కువగా పెరిగేలా చేసేంత కార్బన్ ఉంది. ఇది విడుదలైతే వాతావరణం మరింత వేడెక్కుతుంది. ఇది చివరికి ఆర్కిటిక్ ఇంకాస్త వేడెక్కేలా చేస్తుంది. పెర్మాఫ్రాస్ట్ ఇంకాస్త త్వరగానూ కరుగుతుంది. ఇదో విష వలయంలా తయారవుతుంది. మరో ఉపద్రవం- గ్రీన్లాండ్ మంచు ఫలకం కరగటం. ఉత్తరార్ధ గోళంలోని అతి పెద్ద మంచు ఫలకం ఇదే. దీనిలో సముద్ర మట్టాల ఎత్తు 7.4 మీటర్ల వరకు పెరిగేలా చేసేంత మంచు ఉంది. మంచు పోగుపడటం కన్నా కరిగే వేగం పెరిగితే పెను ప్రమాదం ముంచుకొచ్చినట్టే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్‌ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్‌ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్‌తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్‌కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్‌నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి. -
బొగ్గు దాణా!
బొగ్గుతో ఏం చేస్తారు? పొయ్యిలో మండించి వంట వండుకుంటారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇంకేం చేస్తారు? చైనా శాస్త్రవేత్తలైతే దాణానూ తయారుచేస్తారు -
ఏఐ స్టెతస్కోప్
డాక్టర్ దగ్గరికి వెళ్లగానే ముందుగా పరీక్షించేది స్టెతస్కోప్‌తోనే. గుండె చప్పుడును వినటం దగ్గరి నుంచి ఊపిరితిత్తి జబ్బుల ఆనవాళ్లను పసిగట్టటం వరకూ ఇది ఎన్నో విధాలుగా తోడ్పడుతోంది. అధిక రక్తపోటును కచ్చితంగా నిర్ధరించటానికీ డాక్టర్లు మణికట్టు వద్ద స్టెతస్కోప్‌ను ఆనించి పై, కింది సంఖ్యలను నమోదు చేస్తుంటారు. -
క్యాన్సర్ తీరును పసిగట్టే ఏఐ
ఆరోగ్యరంగంలో కృత్రిమ మేధ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతోంది. క్యాన్సర్ తీరుతెన్నులను విశ్లేషించటంలోనూ సాయం చేస్తోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్‌వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు రూపొందించిన ‘సియోగ్రాఫ్’ ఏఐ మోడలే దీనికి నిదర్శనం. -
అంతరిక్ష వీడియో ప్రసారాలు!
ఒక దెబ్బకు రెండు పిట్టలు! సైకీ గ్రహశకలం మీదికి ఇటీవల నాసా ప్రయోగించిన వ్యోమనౌక గురించి ఇలాగే చెప్పుకోవాలి. లోహంతో కూడిన ఈ గ్రహశకలం భూ అంతర్భాగ రహస్యాలను తెలుసుకోవటానికి తోడ్పడటం ఒక ప్రయోజనమైతే.. -
కృత్రిమ మేధ ఆసుపత్రి!
నేటి కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ప్రతీ అంతర్జాల పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫొటోలు, వీడియోలు సృష్టించు కోవటం వంటివన్నీ చిటికెలో పనులుగా మారిపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు