మెదడులాంటి పదార్థం!

అదో పదార్థం. అయితేనేం? మెదడు మాదిరిగా ఆలోచిస్తుంది! అమెరికా వాయుసేన, పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఇలాంటి వినూత్న పాలిమర్‌ పదార్థాన్నే సృష్టించారు. మృదువుగా ఉండే ఇది డిజిటల్‌ సమాచారాన్ని గ్రహించుకొని, దాన్ని విడమర్చుకోవటమే కాదు..

Published : 31 Aug 2022 00:26 IST

అదో పదార్థం. అయితేనేం? మెదడు మాదిరిగా ఆలోచిస్తుంది! అమెరికా వాయుసేన, పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఇలాంటి వినూత్న పాలిమర్‌ పదార్థాన్నే సృష్టించారు. మృదువుగా ఉండే ఇది డిజిటల్‌ సమాచారాన్ని గ్రహించుకొని, దాన్ని విడమర్చుకోవటమే కాదు.. దాన్ని కొత్త డిజిటల్‌ సమాచారంగానూ మార్చుకుంటుంది. అంటే ఒకరకంగా ఇది మన మెదడులా సమాచారాన్ని గ్రహించి, ఆలోచిస్తుందన్నమాట. దీని పరిజ్ఞానం ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇది సిలికాన్‌ సెమీకండక్టర్లతో సమాచారాన్ని విశ్లేషించుకుంటుంది. బయటి నుంచి పడే ప్రభావాలను గ్రహించి, వాటిని విద్యుత్‌ సమాచారంగా మలచుకుంటుంది. దీన్ని అర్థం చేసుకొని, అవసరమైన సంకేతాలను వెలువరుస్తుంది. ఈ కొత్త పదార్థాన్ని రేడియో ఫ్రీక్వెన్సీలను గుర్తించటానికి.. స్వయంచాలిత అన్వేషణ, ఆపదలో ఆదుకునే వ్యవస్థల వంటి వాటికి కాంతి సంకేతాలను అందించటానికీ వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని