సీవో2ను గ్రహించే సూపర్‌కెపాసిటర్‌

బ్యాటరీ మాదిరిగా శక్తిని నిల్వ చేసుకుంటుంది. అదే సమయంలో చుట్టుపక్కల వాతావరణం నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ (సీవో2)ను గ్రహించు కుంటుంది.

Published : 07 Sep 2022 00:18 IST

బ్యాటరీ మాదిరిగా శక్తిని నిల్వ చేసుకుంటుంది. అదే సమయంలో చుట్టుపక్కల వాతావరణం నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ (సీవో2)ను గ్రహించు కుంటుంది. ఇలాంటి కొత్తరకం సూపర్‌ కెపాసిటర్‌ను యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి పరిశోధకులు రూపొందించారు. రెండు నాణాలంత పెద్దగా ఉండే దీన్ని కొబ్బరి చిప్పలు, సముద్రపు నీరు వంటి సుస్థిర పదార్థాలతోనే తయారు చేయటం విశేషం. ఇందులో రెండు ధన, రుణ ఆవేశిత ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఛార్జింగ్‌ అయ్యే సమయాన్ని పెంచటం ద్వారా కార్బన్‌ డయాక్సైడ్‌ను మరింత ఎక్కువగా ఒడిసిపట్టేలా దీన్ని తీర్చిదిద్దారు. ఈ కార్బన్‌ డయాక్సైడ్‌ దీనిలోని సముద్రపు నీటిలో కరిగిపోతుంది. నేరుగా వాతావరణంలోంచి కాలుష్యాన్ని తొలగించే దిశగా కొత్త ఆశా కిరణంగా కనిపిస్తోంది. ఇది పూర్తిస్థాయిలో వాడకంలోకి రావటానికి ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని