వృద్ధాప్య సమస్యలకు చెక్‌!

వృద్ధాప్యంలో రకరకాల సమస్యలు చుట్టుముడుతుంటాయి. వీటిని అరికట్టటానికి శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో బ్రిటన్‌లోని వెల్‌కం సాంగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు కొత్త విషయాన్ని గుర్తించారు.

Published : 07 Sep 2022 00:18 IST

వృద్ధాప్యంలో రకరకాల సమస్యలు చుట్టుముడుతుంటాయి. వీటిని అరికట్టటానికి శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో బ్రిటన్‌లోని వెల్‌కం సాంగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు కొత్త విషయాన్ని గుర్తించారు. క్రమంగా, నెమ్మదిగా తలెత్తే మార్పుల మూలంగా 70 ఏళ్ల తర్వాత ఎర్ర రక్తకణాల ఉత్పత్తి గణనీయంగా మారిపోతోందని కనుగొన్నారు. పునరుత్పత్తితో సంబంధం లేని మామూలు, సొమాటిక్‌ కణాల్లో తలెత్తే మార్పులు వృద్ధాప్యానికి దోహదం చేస్తుంటాయని భావి స్తుంటారు. అయితే ఇవి ఆయా అవయవాల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది స్పష్టంగా తెలియదు. మన శరీరంలో ప్రతి సెకండుకు 20 లక్షల రక్తకణాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి ఎముకమజ్జలోని హెమటోపాయిటిక్‌ కణాల (హెచ్‌ఎస్‌సీ) నుంచి పుట్టు కొస్తుంటాయి. వయసు మీద పడుతున్నకొద్దీ ఈ హెచ్‌ఎస్‌సీల్లో మార్పులు మొదలై, అవి పోగుపడుతూ వస్తుంటాయి. కొన్ని మార్పులు ఈ కణాల మనుగడకు, వృద్ధికి తోడ్పడితే.. కొన్ని మార్పులు పెద్దగా ప్రభావమేమీ చూపించకుండా ఉండిపోతుంటాయి. అయితే మలివయసులో.. 70 ఏళ్ల తర్వాత వీటి సామర్థ్యం గణనీయంగా పడి పోతున్నట్టు, ఫలితంగా కణాల వైవిధ్యం తగ్గిపోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వృద్ధులు ఎక్కువగా జబ్బులు, ఇన్‌ఫెక్షన్ల బారినపడటానికి ఇదొక కారణం కావొచ్చని అనుకుంటున్నారు. ఈ ప్రక్రియను లోతుగా అర్థం చేసుకోగలిగితే వృద్ధాప్య సమస్యలకు కళ్లెం వేసే మార్గం లభించగలదని ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు