వృక్ష పోషక మాంసం!

ప్రయోగశాలలో మాంసాన్ని వృద్ధి చేసే ప్రక్రియ శరవేగంగా పుంజుకుంటోంది. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు మరో కొత్త పద్ధతిని ఆవిష్కరించారు.

Published : 07 Sep 2022 00:27 IST

ప్రయోగశాలలో మాంసాన్ని వృద్ధి చేసే ప్రక్రియ శరవేగంగా పుంజుకుంటోంది. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు మరో కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. మొక్కల నుంచి సంగ్రహించిన పోషకాలతో ఆవు కండర కణజాలాన్ని వృద్ధి చేయటం దీనిలోని కీలకాంశం. ‘బీఫీ-9’ అనే వృద్ధి మాధ్యమంతో దీన్ని సుసాధ్యం చేశారు. ప్రస్తుతం ప్రయోగశాలలో మాంసాన్ని తయారుచేయటానికి వాడుతున్న మాధ్యమం కన్నా ఇది చాలా చవకైనది. దీంతో జంతువులను వధించకుండానే మాంసం రుచిని ఆస్వాదించటానికి మరో ముందడుగు పడినట్టయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని