గ్రహాంతర జీవులను చూడకుండానే..

గ్రహాంతర జీవుల మీద మనకు మొదట్నుంచీ ఆసక్తే. ఇతర గ్రహాల్లో అధునాతన నాగరికతల జాడను గుర్తించటం మీద అన్వేషణ సాగుతూనే ఉంది.

Updated : 14 Sep 2022 01:22 IST

గ్రహాంతర జీవుల మీద మనకు మొదట్నుంచీ ఆసక్తే. ఇతర గ్రహాల్లో అధునాతన నాగరికతల జాడను గుర్తించటం మీద అన్వేషణ సాగుతూనే ఉంది. ఇంతకీ ఈ శోధన ఎప్పుడు మొదలైందో తెలుసా? 1960లో. గ్రహాంతర జీవులను గుర్తించాలనే ఆశ, ఆసక్తితో అమెరికాకు చెందిన ఫ్రాంక్‌ డ్రేక్‌ తొలిసారి ఓ జంట నక్షత్రాల మీద టెలిస్కోప్‌ను కేంద్రీకరించారు. తాను జీవించి ఉండగానే గ్రహాంతర జీవులను చూస్తానని గట్టిగా విశ్వసించిన డ్రేక్‌ ఇటీవల కాలిఫోర్నియాలో కన్నుమూశారు. అలా ఆయన కల తీరకుండానే పోయింది. డ్రేక్‌ ఒక్క గ్రహాంతర జీవుల అన్వేషణ మీదే కాదు, ఇతరత్రా అంశాల మీదా దృష్టి సారించారు. ఆయన సాధించిన విజయాల్లో గొప్పగా చెప్పుకోవాల్సింది డ్రేక్‌ ఈక్వేషన్‌ గురించి. నక్షత్ర మండలంలో ఎన్ని ఆధునిక నాగరికతలు ఉండొచ్చనేది అంచనా వేయటానికిది తోడ్పడుతుంది. ఇప్పటికీ దీన్నే వాడుతున్నారు. ఇందులో ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వీటిల్లో కొన్ని అనుభావికమైనవి (ఉదా: పాలపుంతలో ఏయే నక్షత్రాలు పుట్టుకొచ్చాయి?) అయితే మరికొన్ని విద్యాసంబంధ అంచనాలు  (ఉదా: సాంకేతిక పరిజ్ఞాన నాగరికత సగటు జీవనకాలం).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని