ఇస్రో వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం

ప్రపంచ వాణిజ్య ఉపగ్రహ సేవలకూ ఇస్రో సిద్ధమైంది. ఈనెల 23న బ్రిటన్‌ అంకుర సంస్థ వన్‌వెబ్‌కు సంబంధించిన 36 బ్రాడ్‌బ్యాండ్‌ ఉపగ్రహాలను ప్రయోగించనుంది.

Published : 19 Oct 2022 00:30 IST

ప్రపంచ వాణిజ్య ఉపగ్రహ సేవలకూ ఇస్రో సిద్ధమైంది. ఈనెల 23న బ్రిటన్‌ అంకుర సంస్థ వన్‌వెబ్‌కు సంబంధించిన 36 బ్రాడ్‌బ్యాండ్‌ ఉపగ్రహాలను ప్రయోగించనుంది. వీటిని అతి బరువైన ఎల్‌వీఎం3 రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపించనుంది. ఈ రాకెట్‌ను ఇంతకుముందు జీఎస్‌ఎల్‌వీ ఎంకే 3 అని పిలుచు కునేవారు. ఇప్పటికే క్రయో దశ, ఎక్విప్‌మెంట్‌ బే కూర్పు ప్రక్రియ పూర్తయ్యింది. ఉపగ్రహాలను నౌకలో అమర్చారు. తుది వాహన తనిఖీ ప్రక్రియ కొనసాగుతోందని ఇస్రో పేర్కొంది. కొత్త ఎల్‌వీఎం3 రాకెట్‌ నాలుగు టన్నుల బరువైన ఉపగ్రహాలను జియోసింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ కక్ష్యలోకి ప్రవేశ పెట్టగలదు. రోజురోజుకీ వాణిజ్య ఉపగ్రహాలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఇస్రో కొత్త మార్గాలను అనుసరించటంపై దృష్టి సారించింది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని