ఓలర్‌ వృత్తాలు అలా!

గణితంలో సమితులు (సెట్స్‌) పరిష్కరించే ఉంటారు. వీటికి సంబంధించిన లెక్కలను చేసేటప్పుడు గుండ్రంగానో, అండాకారంలోనో వృత్తాలు గీసే ఉంటారు. ఇంతకీ వీటి పేరేంటో తెలుసా? ఓలర్‌ వృత్తాలు. సమితులు, ఉపసమితులను.. వాటి మద్య సంబంధాన్ని ప్రతిబింబించే ఇవి ఆయా అంశాలను స్పష్టంగా విభజించి చూపటానికి బాగా ఉపయోగపడతాయి.

Published : 26 Oct 2022 00:16 IST

ణితంలో సమితులు (సెట్స్‌) పరిష్కరించే ఉంటారు. వీటికి సంబంధించిన లెక్కలను చేసేటప్పుడు గుండ్రంగానో, అండాకారంలోనో వృత్తాలు గీసే ఉంటారు. ఇంతకీ వీటి పేరేంటో తెలుసా? ఓలర్‌ వృత్తాలు. సమితులు, ఉపసమితులను.. వాటి మద్య సంబంధాన్ని ప్రతిబింబించే ఇవి ఆయా అంశాలను స్పష్టంగా విభజించి చూపటానికి బాగా ఉపయోగపడతాయి. సంక్లిష్ట క్రమానుగతులను, అతివ్యాప్తి నిర్వచనాలను వివరించటానికివి ఎంతగానో దోహదం చేస్తాయి. ఒక వృత్తాన్ని మరో వృత్తం ఖండించే చోట ఉన్నవి ఆ రెండింటికీ సంబంధించినవనే సంగతి చూడగానే ఇట్టే అర్థమవుతుంది. ఈ వృత్తాలను ఆంగ్ల గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త జాన్‌ వెన్‌ బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. స్వీడన్‌ గణిత శాస్త్రవేత్త లియాన్‌హార్డ్‌ ఓలర్‌ గౌరవార్థం ఆయనే వీటికి ‘ఓలర్‌ సర్కిల్స్‌’ అనీ నామకరణం చేశారు. 60ల్లో కొత్త గణితశాస్త్ర ఉద్యమంలో భాగంగా ముందుకొచ్చిన సమితి సిద్ధాంతంలో ఓలర్‌, వెన్‌ డయాగ్రామ్స్‌ రెండింటినీ చేర్చారు. ఇవి రెండూ ఒకేలా కనిపించినా, కాస్త తేడా ఉంటుంది. ప్రస్తుతం హేతువు, సంభావ్యత, సాంఖ్యక శాస్త్రంలో వీటిని విరివిగా వాడుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని