అతి చిన్న స్పెక్ట్రోమీటర్‌

మైక్రోచిప్‌ మీద అమర్చటానికి వీలైన అత్యంత శక్తిమంతమైన, అతి పలుచటి స్పెక్ట్రోమీటర్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు.

Updated : 30 Nov 2022 00:18 IST

మైక్రోచిప్‌ మీద అమర్చటానికి వీలైన అత్యంత శక్తిమంతమైన, అతి పలుచటి స్పెక్ట్రోమీటర్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది కృత్రిమ మేధ సాయంతో పనిచేస్తుండటం గమనార్హం. కాంతిని విశ్లేషించటానికి, తరంగ దైర్ఘ్యాలను గణించటానికి తోడ్పడే స్పెక్ట్రోమీటర్లను ఖగోళం దగ్గర్నుంచి వజ్రాల వరకూ వివిధ రంగాల్లో ఉపయోగి స్తుంటారు. ఇవి కాంతిని గ్రహించి, దాన్ని వర్ణపటం భాగాలుగా విడగొడతాయి. తరంగదైర్ఘ్య సంకేతాలుగా డిజిటల్‌ రూపంలోకి మార్చి విశ్లేషిస్తాయి. వాటిని కంప్యూటర్‌ తెర మీద కనిపించేలా చేస్తాయి. కాకపోతే ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఖరీదూ ఎక్కువే. తాజా స్పెక్ట్రోమీటర్‌ దీనికి భిన్నం. అతి చిన్నగా ఉండటం వల్ల దీన్ని స్మార్ట్‌ఫోన్‌లోనూ అమర్చొచ్చు. దీంతో ఫోన్‌తోనే కొన్నిరకాల వైద్య పరీక్షలూ చేయొచ్చు. చుట్టుపక్కల పరిస్థితులను స్కాన్‌ చేసి, వాతావరణ స్థితిగతులనూ తెలుసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని