గూగుల్‌ శోధన భలే!

అంతర్జాల శోధనకు, సందేహ నివృత్తికి గూగుల్‌ ఎంతగానో తోడ్పడుతుంది. చాలామంది రోజువారీ వ్యవహారాల్లో ఇదో విడదీయలేని భాగంగా మారిందన్నా అతిశయోక్తి కాదు. అయితే ఆన్‌లైన్‌లో సమాచారం కుప్పలు తెప్పలుగా ఉంటుంది.

Published : 08 Mar 2023 00:43 IST

అంతర్జాల శోధనకు, సందేహ నివృత్తికి గూగుల్‌ ఎంతగానో తోడ్పడుతుంది. చాలామంది రోజువారీ వ్యవహారాల్లో ఇదో విడదీయలేని భాగంగా మారిందన్నా అతిశయోక్తి కాదు. అయితే ఆన్‌లైన్‌లో సమాచారం కుప్పలు తెప్పలుగా ఉంటుంది. ఇందులోంచి మనకు అవసరమైన సమాచారాన్ని, అదీ కచ్చితమైన అంశాలను వెతికి పట్టుకోవటమంటే మాటలు కాదు. కానీ కొన్ని తేలికైన చిట్కాలతో గూగుల్‌తో చిటికెలో పనిచేయించుకోవచ్చు.

* గుణకారాలు తేలికగా చేయాలనుకుంటున్నారా? అయితే నక్షత్రం గుర్తును (*) వాడుకోవచ్చు. ఉదాహరణకు 7ను 5తో గుణిస్తే ఎంత వస్తుందో తెలుసుకోవాలనుకుంటే సెర్చ్‌ బార్‌లో 7*5 అని టైప్‌ చేయాలి. వెంటనే సమాధానం కనిపిస్తుంది. కింద కాలిక్యులేటర్‌ కూడా దర్శనమిస్తుంది. కావాలంటే దాంతోనూ లెక్కలు చేసుకోవచ్చు.

* సెర్చ్‌ ఫలితాల్లో ఏవైనా అంశాలు వద్దనుకుంటే హైఫన్‌ (-) గుర్తు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు జాగ్వార్‌ పులి గురించి వెతుకుతున్నారు. కానీ కారు గురించి కాదనుకోండి. అప్పుడు జాగ్వార్‌ మైనస్‌ కార్‌ అని టైప్‌ చేయాలి. దీంతో కారుకు సంబంధించిన ఫలితాలు కనిపించవు.

* సామాజిక మాధ్యమాల అంశాల గురించి వెతకాలని అనుకుంటే ఎట్‌ @  గుర్తు వాడుకోవచ్చు. ఉదాహరణకు ట్విటర్‌లో ఈనాడు లైవ్‌ న్యూస్‌ పోస్టులను చూడాలని అనుకున్నారనుకోండి. సెర్చ్‌ బార్‌లో  @eenadulivenews Twitte అని టైప్‌ చేస్తే చాలు.

* ఆయా పదాలకు, పదబంధాలకు సంబంధించి కచ్చితమైన ఫలితాలు చూడాలనుకుంటే కొటేషన్‌ చిహ్నాలు సాయం చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం గురించే వెతుకుతున్నట్టయితే "healthy eating" అని టైప్‌ చేయొచ్చు. అప్పుడు ఆ రెండు పదాలకు చెందిన అంశాలే కనిపిస్తాయి.

* అదే పదానికి చెందిన నానార్థాలనూ వెతికి పెట్టటానికి పదం ముందు అల గుర్తును (~) చేర్చొచ్చు. ఉదాహరణకు గుర్రాల గురించి వెతుకుతున్నారనుకోండి. horse ~breeds అని టైప్‌ చేస్తే గుర్రాల జాతులు, రకాల వంటి వాటికి సంబంధించిన అంశాలూ ప్రత్యక్షమవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని