సీవో2 ప్రక్షాళన కొత్తగా..

గాలిలోంచి కార్బన్‌ డయాక్సైడ్‌(సీవో2)ను ఒడిసిపట్టి, దాన్ని వంట సోడాగా మార్చి.. మహా సముద్రాల్లో నిల్వ చేస్తే? గాలి కాలుష్యం చాలావరకు తగ్గుతుంది కదా.

Updated : 22 Mar 2023 03:18 IST

గాలిలోంచి కార్బన్‌ డయాక్సైడ్‌(సీవో2)ను ఒడిసిపట్టి, దాన్ని వంట సోడాగా మార్చి.. మహా సముద్రాల్లో నిల్వ చేస్తే? గాలి కాలుష్యం చాలావరకు తగ్గుతుంది కదా. అమెరికాలోని లీహై యూనివర్సిటీ పరిశోధకులు అలాంటి ఘనతే సాధించారు. గాలిలోంచి కార్బన్‌ డయాక్సైడ్‌ను ఒడిసిపట్టే కొత్తరకం పదార్థాన్ని సృష్టించారు. అమైన్‌ ద్రావణిలను రాగి మిశ్రమంలో కలిపి దీన్ని తయారుచేశారు. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న పదార్థాల కన్నా రెండు నుంచి మూడు రెట్లు అధికంగా కార్బన్‌ డయాక్సైడ్‌ను గ్రహిస్తుండటం గమనార్హం. దీన్ని చవకగా, త్వరగా తయారుచేసే వీలుందనీ పరిశోధకులు చెబుతున్నారు. గ్రహించిన కార్బన్‌డయాక్సైడ్‌ను సముద్రనీటితో కలిపి వంట సోడాగా మార్చొచ్చని.. అనంతరం సురక్షితంగా సముద్రాల్లో నిల్వ చేయొచ్చని వివరిస్తున్నారు. వంట సోడాను సముద్రంలో కలిపినా పర్యావరణానికి హానేమీ చేయదని చెబుతున్నారు. ఇది క్షార గుణం కలిగుండటం వల్ల కార్బన్‌ డయాక్సైడ్‌ కరిగినప్పుడు ఏర్పడే ఆమ్లతత్వాన్ని తగ్గిస్తుందని పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని