ఇంజెన్యూటీ 50వ ప్రయాణం!

నాసాకు చెందిన ఇంజెన్యూటీ మార్స్‌ హెలికాప్టర్‌ తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. వేరే గ్రహం మీద ఎగురుతున్న మొట్టమొదటి విమానమైన ఇది ఇటీవలే 50వ ప్రయాణాన్ని పూర్తి చేసింది.

Published : 19 Apr 2023 00:20 IST

నాసాకు చెందిన ఇంజెన్యూటీ మార్స్‌ హెలికాప్టర్‌ తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. వేరే గ్రహం మీద ఎగురుతున్న మొట్టమొదటి విమానమైన ఇది ఇటీవలే 50వ ప్రయాణాన్ని పూర్తి చేసింది. మొత్తం 145.7 సెకండ్లలో 322.2 మీటర్ల దూరం ప్రయాణించింది. అత్యంత ఎక్కువగా 18 మీటర్ల ఎత్తులో ఎగిరింది కూడా. అంగారకుడి మీద 800 మీటర్ల వెడల్పయిన బెల్వా బిలం వద్ద కిందికి దిగింది. అంగారకుడి మీద చలికాలం ఆరంభం కావటంతో భారీ దుమ్ము తుపాను చెలరేగింది. దీని మూలంగా ఇంజెన్యూటీ హెలికాప్టర్‌ చాలాకాలం పనిచేయకుండా ఉండాల్సిందే. అయినా కూడా తన పని కొనసాగించింది. దీని భాగాలను చాలావరకు స్మార్ట్‌ఫోన్‌ ప్రాసెసర్లు, కెమెరాల వంటి మామూలు వాటితోనే రూపొందించటం విశేషం. అయినప్పటికీ ఇది 23 నెలల పాటు పనిచేస్తూనే వస్తోంది. మొదట్లో 5 సార్లు ఎగిరితేనే గొప్పని అనుకున్నారు. ఏకంగా 50 సార్లు ప్రయాణించి ఇంకా అబ్బురపరుస్తోంది. భవిష్యత్‌ అంగారకుడి హెలికాప్టర్ల తయారీకి ఇది అందిస్తున్న సమాచారం ఉపయోగపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు