డార్విన్‌ ఊహ నిజమైన వేళ..

శాస్త్రవేత్తల ఆలోచనా తీరే వేరు. కొన్నిసార్లు ఊహలే నిజమవుతుంటాయి. తోటి శాస్త్రవేత్తలు గేలి చేసినా తర్వాత వాస్తవమేనని రుజువవుతుంటాయి. ఛార్లెస్‌ డార్విన్‌ విషయంలోనూ ఇది నిజమైంది.

Published : 03 May 2023 00:01 IST

శాస్త్రవేత్తల ఆలోచనా తీరే వేరు. కొన్నిసార్లు ఊహలే నిజమవుతుంటాయి. తోటి శాస్త్రవేత్తలు గేలి చేసినా తర్వాత వాస్తవమేనని రుజువవుతుంటాయి. ఛార్లెస్‌ డార్విన్‌ విషయంలోనూ ఇది నిజమైంది. ఆయన పరిణామ సిద్ధాంతం గురించి అందరికీ తెలిసిందే. ఇదే కాదు, మొక్కలు ఎలా పునరుత్పత్తి చెందుతాయో తెలుసుకోవాలనీ డార్విన్‌ కుతూహల పడేవారు. అలా ఆయన స్టార్‌ ఆర్కిడ్స్‌ మొక్కల మీద పరిశోధన చేస్తున్నప్పుడు ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించారు. ఈ మొక్కలు ఒక అడుగు దూరం వరకు మకరందాన్ని విరజిమ్మేవి. ఇవెలా పరాగ సంపర్కం జరుపుతాయోనని చాలా ఆశ్చర్యపోయేవారు. చివరికి హాక్‌ అనే ఒకరకం చిమ్మట వీటి పరాగ సంపర్కానికి కారణమవుతుండొచ్చని ఊహించారు. వీటికి పొడవైన నాలుక కూడా ఉండటం విశేషం. అయితే అప్పట్లో తోటి శాస్త్రవేత్తలు డార్విన్‌ ఆలోచనను కొట్టిపారేశారు. ఎందుకంటే చిమ్మటలు పరాగ సంపర్కానికి తోడ్పడతాయని భావించేవారు కాదు. పైగా మడగాస్కర్‌ దీవిలో అప్పటికి హాక్‌ చిమ్మటలు ఉన్నట్టు బయటపడలేదు కూడా. అప్పటికి ఆయన ఊహ అంతటితోనే ఆగిపోయింది. కానీ డార్విన్‌ మరణించిన తర్వాత మడగాస్కర్‌ దీవిలో హాక్‌ చిమ్మటలను గుర్తించారు. మకరందాన్ని గ్రోలటం ద్వారా ఇవి పరాగ సంపర్కానికి తోడ్పడుతున్నట్టు బయటపడింది. ఇలా చివరికి డార్విన్‌ సిద్ధాంతం నిజమేనని రుజువైంది. శాస్త్రవేత్తల ఊహలు కేవలం గాలిలోంచి పుట్టుకొచ్చినవి కావని, బలమైన ఆధారమే వీటికి పునాది అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు