ఏఐ ఆయుష్షు!

ఆయుష్షును పెంచే మందుల రూపకల్పనకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) కూడా పాలు పంచుకుంటోంది.

Updated : 10 May 2023 03:24 IST

ఆయుష్షును పెంచే మందుల రూపకల్పనకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) కూడా పాలు పంచుకుంటోంది. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు ఏఐ సాయంతో ఆయుష్షును పెంచే మూడు ‘సెనోలైటిక్‌’ ఔషధ మూలకాలను గుర్తించారు. విభజన చెందలేని కణాలను వాటంతటవే చనిపోయేలా చేయటం వీటి ప్రత్యేకత. సాధారణంగా వయసు మళ్లిన కణాలు చనిపోతుంటాయి. కానీ కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉంటాయి. అలాగని ఇవి ఊరికే ఉండవు. వాపు పక్రియను ప్రేరేపించే రసాయనాలను పుట్టిస్తుంటాయి. ఇలా వయసుతో ముడిపడిన అల్జీమర్స్‌, కీళ్లవాతం వంటి సమస్యలకు దారితీస్తుంటాయి. క్యాన్సర్లకూ కారణమవుతుంటాయి. ఇలాంటి ‘అమర’ వార్ధక్య కణాలను అరికట్టే మందులను తయారు చేస్తే ఆయుష్షు పెంచుకోవచ్చు కదా. ఈ దిశగానే ఏఐ మార్గదర్శక స్క్రీనింగ్‌ కీలకమైన ముందడుగు వేసింది. ఆయుష్షు, ఔషధ పరిశోధనలకు ఏఐ వాడకంలో దీన్ని గొప్ప మేలిమలుపుగా భావిస్తున్నారు. ఇది 8 లక్షలకు పైగా మూలకాలను విశ్లేషించి మూడు ఔషధాలను వెలికి తీసింది. ప్రస్తుత పద్ధతుల కన్నా ఇది మెరుగ్గా  పని చేస్తూ ఉండటం గమనించ దగ్గ విషయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని