కృత్రిమ ఫొటోలు గుర్తించేదెలా?
రోజురోజుకీ కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడిన పనుల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు.
రోజురోజుకీ కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడిన పనుల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. జరగనిది జరిగినట్టుగా, జరిగింది జరగనట్టుగా ప్రచారం చేయటానికీ కొందరు వాడుకోవచ్చు. ఇటీవల దిల్లీలో రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు వాహనంలో వాళ్లు నవ్వుతున్నట్టుగా కనిపించేలా ఫొటోలను మార్చటం కలకలం సృష్టించింది. ఆ మధ్య పోప్ ఫ్రాన్సిస్ తెల్ల జాకెట్ తొడుకున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటం గమనార్హం. తర్వాత అది ఏఐ టూల్ సాయంతో పుట్టించిన నకిలీ ఫొటో అని తేలింది. ఏమాత్రం గుర్తించలేనంతగా, అది అసలు ఫొటోయే అనిపించేలా మార్పు చేయటం ఏఐ సామర్థ్యానికి కొలమానం అయినప్పటికీ ఇలాంటి నకిలీ చిత్రాలు సమాజంలో అనర్థాలకు, వివాదాలకు దారితీయొచ్చు. మరి ఇలాంటి ‘కృత్రిమ’ ఫొటోలను.. అంటే ఏఐ సృష్టించిన చిత్రాలను గుర్తించేదెలా?
ఇమేజ్ మూలాన్ని తనిఖీ చేయటం
ఫొటో అసలుదా? కాదా? అని అనుమానం వస్తే ముందుగా చేయాల్సింది దాని మూలాన్ని తెలుసు కోవటం. ఇందుకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ పద్ధతి తోడ్పడుతుంది. గూగుల్ ఇమేజెస్‌లో ఫొటోను అప్‌లోడ్ చేసి, శోధిస్తే దాన్ని ఇంతకుముందు ఎవరెవరు, ఎక్కడెక్కడ వాడారో తెలిసిపోతుంది. టిన్‌ఐ, యాండెక్స్ వంటి వెబ్‌సైట్లనూ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌కు ఉపయోగించు కోవచ్చు. అవసరమైతే ఏఐ ఇమేజ్ డిటెక్టర్ టూల్స్ సాయం తీసుకోవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో చాలా వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి.
చేతులు, నవ్వు తేడాగా
చేతుల్లో బోలెడన్ని కీళ్లుంటాయి. రకరకాల ఆకారాలు, కదలికలకూ కొదవలేదు. అందువల్ల ఏఐ పరికరాలకు చేతులను సృష్టించటం కష్టమైన పనే అనుకోవచ్చు. సాధారణంగా వేళ్లను అదనంగా జోడించటమో లేదా తీసేయటమో చేస్తుంటాయి. వికృతంగా వంకర్లూ తిప్పొచ్చు. ఒక్క చేతులే కాదు.. నిర్దిష్టమైన ఆకారాల్లో, కొలతల్లో గలవాటిని అంతే కచ్చితంగా సృష్టించటంలో ఏఐ చాలాసార్లు విఫలమవుతుంది. ఉదాహరణకు- నవ్వుతున్నప్పుడు నోట్లో చాలా దంతాలు ఉండొచ్చు. అసలు వ్యక్తి ముఖంలో లేని మార్పులూ కనిపించొచ్చు. నిశితంగా గమనిస్తే ఇలాంటి తేడాలు బయటపడతాయి.
నేపథ్యం వేరేగా
కృత్రిమ మేధ ఫొటోల్లో మరో బలహీనత బ్యాక్‌గ్రౌండ్ స్పష్టంగా లేకపోవటం. చాలావరకు నేపథ్యం మసక మసకగా, టెక్చర్‌లా కనిపిస్తుంది. వస్తువులు కూడా అడ్డదిడ్డంగా ఉంటాయి. ఏఐ ప్రోగ్రామ్‌లు మనుషులను, వస్తువులను క్లోన్ చేసి, రెండోసారీ వాడుకునే అవకాశమూ లేకపోలేదు.
చర్మం మరీ ఆకర్షణీయంగా
కొన్ని ఏఐ ఇమేజ్ ప్రోగ్రామ్‌లు చర్మం, ఉపరితలం మరీ నున్నగా, ఇంకాస్త ఆకర్షణీయంగా ఉండేలా ఫొటోలను సృష్టిస్తుంటాయి. చర్మం సహజంగా కాకుండా ఏదో తేడా ఉన్నట్టు కనిపిస్తే కృత్రిమ ఫొటో అయ్యే అవకాశమే ఎక్కువ.
అవయవ కొలతల్లో తేడాలు
కృత్రిమ మేధ సృష్టించే ఫొటోల్లో తరచూ శరీర భాగాల తీరుతెన్నుల్లో తేడాలు కనిపిస్తున్నట్టు జర్మనీ వార్తా సంస్థ డీడబ్ల్యూ నివేదికలో వెల్లడైంది. ఉదాహరణకు- చేతులు మరీ పెద్దగా లేదూ వేళ్లు చాలా పొడవుగా, ఎక్కువగానూ ఉండొచ్చు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోకరిల్లినట్టు ఒక నకిలీ ఫొటో గత సంవత్సరంలో వ్యాప్తి చెందటం దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందులో మోకరిల్లిన వ్యక్తి షూ పెద్దగా, వెడల్పుగా ఉంటుంది. పిక్క సాగిపోయినట్టు కనిపిస్తుంది. కిందికి వంగిన తల భాగమూ చాలా పెద్దగా ఉంటుంది. మిగతా శరీర కొలతలకు సరిపోదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ayodhya Temple: జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం!
-
World Cup 2023: వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. సీనియర్ ఆటగాడికి దక్కని చోటు
-
TET Results: 27న టెట్ ఫలితాలు.. ఎన్నిగంటలకంటే?
-
PM Modi: అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటన
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత