కార్బన్‌ డయాక్సైడ్‌ ఇంధనం

వాతావరణ సంక్షోభం తీవ్రమవుతున్న తరుణంలో శాస్త్రవేత్తలు గాలి నుంచి కార్బన్‌డయాక్సైడ్‌ను వెలికి తీయటం మీద ముమ్మరంగా కృషి చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకునే విధంగా మలచే పద్ధతులను కనుగొనాలని ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ), హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు ముందడుగు వేశారు.

Published : 08 Nov 2023 00:05 IST

వాతావరణ సంక్షోభం తీవ్రమవుతున్న తరుణంలో శాస్త్రవేత్తలు గాలి నుంచి కార్బన్‌డయాక్సైడ్‌ను వెలికి తీయటం మీద ముమ్మరంగా కృషి చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకునే విధంగా మలచే పద్ధతులను కనుగొనాలని ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ), హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు ముందడుగు వేశారు. కార్బన్‌ డయాక్సైడ్‌ను ఇంధనంగా మార్చే సమర్థ విధానాన్ని కనుగొన్నారు. ఇది కార్బన్‌ డయాక్సైడ్‌ను ద్రవ లేదా ఘన పదార్థం రూపంలోకి మారుస్తుంది. దీన్ని హైడ్రోజన్‌ లేదా మెథనాల్‌ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. ఫ్యూయెల్‌ కణాలకు శక్తిని అందించటానికి, విద్యుత్తు ఉత్పత్తికి వాడుకోవచ్చు. ప్రయోగశాల స్థాయిలోనే దీన్ని సాధించినప్పటికీ పెద్దఎత్తున కూడా అమలు చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇళ్లకు ఉద్గార రహిత విద్యుత్తు, వేడిని అందించొచ్చని ఆశిస్తున్నారు. ఇది కార్బన్‌ డయాక్సైడ్‌ను 90% వరకు ఇంధనంగా మారుస్తుండటం గమనార్హం. ఈ ప్రక్రియలో ముందుగా కార్బన్‌ డయాక్సైడ్‌ను మాధ్యమిక రూపంలోకి.. అంటే ద్రవ లోహ బైకార్బోనేట్‌గా మారుస్తారు. అనంతరం అణు, వాయు, సౌర విద్యుత్తు వంటి స్వల్ప కర్బన విద్యుత్తుతో పనిచేసే ఎలక్ట్రోలైజర్‌లో విద్యుత్‌రసాయన పద్ధతిలో ద్రవ పొటాషియం లేదా సోడియం ఫార్మేట్‌గా మారుస్తారు. దీన్ని ఎండించి ఘన పొడిగా చేస్తారు. దీంతో ఇది స్థిరంగా ఉంటుంది. చాలాకాలం పాటు నిల్వ చేసుకోవచ్చు కూడా. ఈ పొడిని ఇళ్ల దగ్గరి నుంచి పరిశ్రమల వరకూ ఇంధనంగా వాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని