
Google Chat: జీమెయిల్‌లో గూగుల్ చాట్.. సులువుగా ఆడియో/వీడియో కాలింగ్!
ఇంటర్నెట్‌డెస్క్: జీమెయిల్ వినియోగాన్ని మరింత సులభతరం చేసేందుకు గూగుల్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో జీమెయిల్ యూజర్స్ సులువుగా ఆడియో, వీడియో కాల్స్ చేయొచ్చు. ఇందుకోసం గూగుల్ ఛాట్ ఫీచర్‌ను జీమెయిల్‌లో పరిచయం చేయనుంది. యూజర్స్ గూగుల్ చాట్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు పైభాగంలోని మూడు చుక్కులపై క్లిక్ చేస్తే ఆడియో, వీడియో సింబల్స్ కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేసి కాల్స్ మాట్లాడొచ్చు. దీని వల్ల ఆఫీస్ ఉద్యోగులు తోటి ఉద్యోగులతో మాట్లాడేప్పుడు సులువుగా చాట్, ఆడియో, వీడియో మోడ్‌లలోకి మారిపోవచ్చని గూగుల్ తెలిపింది.
‘‘గతంలో గూగుల్ చాట్ లేదా మీట్‌లో గ్రూప్ కాల్ మాట్లాడేందుకు చాట్ పేజ్ ద్వారా మీటింగ్ లేదా ఇన్వైట్ లింక్ ఉపయోగించేవారు. కానీ కొత్తగా పరిచయం చేస్తున్న ఫీచర్‌తో మీరు చాట్ పేజీ నుంచే ఆడియో/వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. అయితే ఈ కాల్ మీరు ఒకసారి ఒక యూజర్‌తో మాత్రమే మాట్లాడగలరు. ఒకవేళ మీరు కాల్ మిస్ అయితే రెడ్ కలర్ ఆడియో/వీడియో సింబల్, కాల్ కొనసాగుతుంటే బ్లూ కలర్ బ్యానర్ చాట్ పేజ్ పైభాగంలో కనిపిస్తుంది’’ అని గూగుల్ తన బ్లాగ్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పలువురు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌తోపాటు గూగుల్ వర్క్‌స్పేస్, జీసూట్ బేసిక్, బిజినెస్ ఖాతాదారులకి అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే పూర్తిస్థాయిలో యూజర్స్ అందరికీ పరిచయం చేయనుంది.
► Read latest Gadgets & Technology News and Telugu News