Published : 03/11/2021 01:49 IST

Google Chrome: క్రోమ్‌ యూజర్లకు గూగుల్ కీలక సూచన! 

ఇంటర్నెట్‌డెస్క్‌: గూగుల్ క్రోమ్ యూజర్స్‌కి హ్యాకింగ్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రోమ్ బ్రౌజర్‌ని తరచుగా ఉపయోగించే యూజర్స్‌ వెంటనే తరచుగా తమ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని సూచించారు. అలానే క్రోమ్ బ్రౌజర్‌లోని హిడెన్ ఫీచర్స్‌ని యూజర్స్ ఉపయోగించాలని తెలిపారు. గూగుల్‌ రిమెంబర్‌ దిస్‌ పాస్‌వర్డ్ ఫీచర్‌ ద్వారా హ్యాకింగ్ దాడుల నుంచి యూజర్‌కి భద్రత కల్పిస్తుంది. అయితే క్రోమ్‌లో పాస్‌వర్డ్ టైప్‌ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేసుకుంటే, ఒకవేళ పాస్‌వర్డ్‌ని ఎవరైనా హ్యాక్‌ చేస్తే గూగుల్ యూజర్‌కి తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 4 బిలియన్ల (400 కోట్లకు)పైగా యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లు హ్యాకింగ్ గురైనట్లు తెలిపింది.

హ్యాకింగ్‌ నివారించేందుకు 2019లో గూగుల్ నిర్వహించిన తొలి పరీక్షల్లో 6,50,000 మంది పాల్గొన్నట్లు గూగుల్‌ ప్రతినిధి జెన్నీఫర్ తెలిపారు. వీటిలో సుమారు 3 లక్షల యూజర్ నేమ్‌, పాస్‌వర్డ్‌లు సురక్షితమైనవి కాదని గుర్తించినట్లు చెప్పారు. థర్డ్‌పార్టీ టూల్స్‌ కారణంగా హ్యాకర్స్‌కు అందిన సమాచారంతో వారు తరచుగా యూజర్‌ ఖాతాలను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంటారని.. ఒకవేళ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ పటిష్ఠంగా ఉంటే మాత్రం హ్యాక్‌ చేయలేరని తెలిపారు. గూగుల్ క్రోమ్‌ లేదా రిమెంబర్‌ దిస్‌ పాస్‌వర్డ్‌ ఫీచర్‌ ఉపయోగించే యూజర్ పాస్‌వర్డ్ సురక్షితం కాదని భావిస్తే గూగుల్ వారిని పాస్‌వర్డ్ మార్చుకోమని సూచిస్తుంది. అలాగే, మీ ఖాతాకు సంబంధించి ఏదైనా అనుమానాస్పద లాగిన్ జరిగినా వెంటనే మీ మొబైల్ లేదా మెయిల్‌కి అలర్ట్ మెసేజ్‌ వస్తుంది. అలానే మీ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ని కూడా తరచుగా మార్చుకోవమని సూచిస్తామని గూగుల్ తెలిపింది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని