Google: ఇక మీదట ఆ సేవలు ఉచితంగానే..

వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకమీదట గూగుల్ వర్క్‌స్పేస్‌ సేవలు గూగుల్ ఖాతా ఉన్న యూజర్స్ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ విషయాన్ని.......

Published : 15 Jun 2021 22:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకమీదట గూగుల్ వర్క్‌స్పేస్‌ సేవలు గూగుల్ ఖాతా ఉన్న యూజర్స్ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ విషయాన్ని సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. గూగుల్ వర్క్‌స్పేస్‌తో ప్రతి యూజర్‌ తమకు సంబంధించిన సమాచారాన్ని అప్‌డేట్‌ చేస్తూ, తమ ఆలోచనలను ఛాట్‌ ద్వారా షేర్ చేసుకుంటూ, ముఖ్యమైన సమాచారాన్ని ఒక చోటికి చేరవేస్తూ, ఇతరులతో కలిసి పని చేయవచ్చని గూగుల్ ప్రకటనలో తెలిపింది. 

జీమెయిల్ ఇన్‌బాక్స్‌ ద్వారా యూజర్స్‌ గూగుల్ ఛాట్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. యూజర్స్‌ గూగుల్‌ డాక్స్‌లో చెక్‌లిస్ట్‌ ఏర్పాటు చేసుకునేందుకు ఇందులోని స్మార్ట్‌కాన్వాస్‌ ఫీచర్‌ సాయపడుతుంది. దీని సాయంతో యూజర్స్‌ తమకు సంబంధించిన డాక్యుమెంట్స్‌, వర్క్‌షీట్స్‌, స్లైడ్స్‌ను గూగుల్‌ మీట్‌ కాల్‌లో ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. గతంలో ఈ ఫీచర్స్‌ పెయిడ్ యూజర్స్‌ మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం వీటిని గూగుల్‌ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు ఉచితంగా ఉపయోగించుకోవచ్చని సంస్థ తెలిపింది. అలానే యూజర్స్‌కి సౌకర్యవంతమైన యూజర్‌ ఇంటర్‌ఫేస్ అందించేందుకు గూగుల్ రూమ్స్‌కి స్పేసెస్‌ అనే కొత్త ఫీచర్‌ను జోడిస్తున్నట్లు తెలిపింది. ఇందులో ఇన్‌-లైన్‌ టాపిక్‌ థ్రెడింగ్, ప్రెసెన్స్‌ ఇండికేటర్స్‌, కస్టమ్ స్టేటస్‌లు, ఎక్స్‌ప్రెసివ్ రియాక్షన్స్‌ వంటి ఫీచర్స్‌ ఉంటాయని గూగుల్ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని