Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్‌

ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఐఫోన్‌ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్‌కు మారాలనుకున్న యూజర్లు సులువుగా తమ డేటాను బదిలీ చేసుకోవచ్చు...

Published : 01 Jul 2022 02:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఐఫోన్‌ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్‌కు మారాలనుకున్న యూజర్లు సులువుగా తమ డేటాను బదిలీ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్ యూజర్లలో పిక్సెల్‌ ఫోన్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. చాలా మంది యూజర్లు ఐఓఎస్‌ నుంచి ఆండ్రాయిడ్‌కు మారుతున్నట్లు గూగుల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సాధారణ ఆండ్రాయిడ్ 12 యూజర్లకు కూడా స్విచ్‌ టు ఆండ్రాయిడ్ ఐఓఎస్‌ యాప్‌ను గూగుల్ పరిచయం చేసింది. ఈ ఫీచర్‌ కోసం యూజర్లు తమ ఆండ్రాయిడ్ 12 ఫోన్‌ను ఐఫోన్‌కు కనెక్ట్ చేసి అందులోని కాల్‌లాగ్స్‌, మెసేజెస్‌, ఫొటోస్‌, కాలెండర్‌ డేటాతోపాటు ఇతర డేటాను సులువుగా బదిలీ చేసుకోవచ్చు. అలానే వాట్సాప్‌ మెసేజెస్‌ను కూడా బదిలీ చేసుకోవచ్చు. 

ఐఫోన్‌ నుంచి ఆండ్రాయిడ్‌కు మారాలనుకునే యూజర్లు ముందుగా తమ ఐఫోన్లలో స్విచ్‌ టు ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత యాప్‌ ఓపెన్‌ చేసి అందులో సూచనలు అనుసరిస్తూ ఐఫోన్‌ కేబుల్ సాయంతో లేదా వైర్‌లైస్‌గా కానీ ఐఫోన్‌ను ఆండ్రాయిడ్‌ పోన్‌కు కనెక్ట్ చేసి డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ప్రపంచంలోనే భారత్‌ రెండో అతి పెద్ద మొబైల్ మార్కెట్. ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోన్‌తో పోలిస్తే ఐఫోన్‌ ధర ఎక్కువ. గతంలో ఐఫోన్‌ 5 సిరీస్‌, ఐఫోన్‌ ఎస్‌ఈ (మొదటి జనరేషన్‌), ఐఫోన్‌ 8 సిరీస్‌ వంటి మోడల్స్‌ అందుబాటు ధరలో లభించేవి. గత రెండు సంవత్సరాలుగా విడుదలవుతున్న ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 12, ఐఫోన్ 13 మోడల్స్‌ ఎక్కువగా ఉండటంతో చాలా మంది పాత ఐఫోన్‌ యూజర్లు కూడా ఆండ్రాయిడ్ ఫోన్లకు మారిపోతున్నారు. దీంతో ఆండ్రాయిడ్‌కు మారాలనుకునే వారికి డేటా బదిలీ ప్రక్రియను సులభతరం చేస్తూ గూగుల్ కంపెనీ స్విచ్‌ టు ఆండ్రాయిడ్ యాప్‌ను ఆండ్రాయిడ్ 12 యూజర్లకు పరిచయం చేసిందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని