Google: సెర్చ్‌ హిస్టరీ డిలీట్.. మరింత సులువుగా!

ఏ చిన్న సమాచారం కావాలన్నా మన కళ్లు, వేళ్లు గూగుల్ సెర్చ్‌ వైపు వెళతాయి. వివిధ రకాల కీ వర్డ్స్‌తో వెతికేస్తాం. కొన్నిసార్లు మనం వెతికిన విషయాలు ఇతరులకు తెలియకూడదనో, గోప్యత కోసమో సెర్చ్‌ హిస్టరీని డిలీట్ చేస్తుంటాం. కారణాలు ఏవైనా కావచ్చు

Published : 21 Jul 2021 16:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏ చిన్న సమాచారం కావాలన్నా మన కళ్లు, వేళ్లు గూగుల్ సెర్చ్‌ వైపు వెళతాయి. వివిధ రకాల కీ వర్డ్స్‌తో వెతికేస్తాం. కొన్నిసార్లు మనం వెతికిన విషయాలు ఇతరులకు తెలియకూడదనో, గోప్యత కోసమో సెర్చ్‌ హిస్టరీని డిలీట్ చేస్తుంటాం. కారణాలు ఏవైనా కావచ్చు.. హిస్టరీని డిలీట్ చేసేందుకు గూగుల్ మరో కొత్త ఫీచర్‌ని యూజర్స్‌కి పరిచయం చేయనుంది. డిలీట్ లాస్ట్ 15 మినిట్స్ పేరుతో కొత్త ఆప్షన్‌ను తీసుకొస్తోంది. దీని సాయంతో యూజర్స్ సులువుగా సెర్చ్ హిస్టరీని డిలీట్ చెయ్యొచ్చు. అలానే తమ సెర్చ్‌ హిస్టరీ గురించి ఇతర సంస్థలు, వ్యక్తులకు తెలియకూడదని కోరుకునేవారికి ఈ ఆప్షన్ ఎంతో ఉపయోగకరమని గూగుల్ తెలిపింది. ముందుగా ఈ ఫీచర్ ఐఓఎస్ యూజర్స్‌కి అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్స్‌కి పరిచయం చేయనున్నట్లు సమాచారం.  

ఫోన్‌లో గూగుల్ సెర్చ్ యాప్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ ఫొటో మీద క్లిక్ చేయాలి. తర్వాత సెర్చ్‌ హిస్టరీపై క్లిక్ చేస్తే డిలీట్ ది లాస్ట్ 15 మినిట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే గత 15 నిమిషాల సెర్చ్‌ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోతుంది. ప్రస్తుతం గూగుల్‌లో 1 గంట, 24 గంటలు, 7 రోజులు, 4 వారాలు లేదా పూర్తి హిస్టరీ డిలీట్ చేసే ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. అలానే ఆటోమేటిక్ డిలీట్‌ ఫీచర్‌లో 3, 18, 36 నెలల చాట్ హిస్టరీని డిలీట్ చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. గూగుల్ గోప్యత ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని