వీడియో ఎడిటింగా... ఇంకో యాప్‌ ఎందుకు?

గతంలో మంచి వీడియో తీయాలంటే పెద్ద కెమెరా తప్పనిసరి. ఆ తర్వాత వీడియోని ఎడిట్‌ చేయడం కోసం కంప్యూటర్‌, అందులో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఇలా పెద్ద ప్రాసెస్‌ ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని యాప్‌ యూజర్స్‌ కోసం గూగుల్ ఫొటోస్‌ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది....

Published : 12 Feb 2021 22:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గతంలో మంచి వీడియో తీయాలంటే పెద్ద కెమెరా తప్పనిసరి. ఆ తర్వాత వీడియోని ఎడిట్‌ చేయడం కోసం కంప్యూటర్‌, అందులో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఇలా పెద్ద ప్రాసెస్‌ ఉండేది. కానీ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. వీడియో షూట్ నుంచి ఎడిటింగ్‌ వరకు అన్ని మొబైల్‌ ఫోన్‌లోనే కానించేస్తున్నారు. దానికితోడు మొబైల్‌ తయారీ కంపెనీలు కూడా ఫొటో, వీడియో ఎడిటింగ్‌కు ప్రత్యేక ఫీచర్స్‌ ఇస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని యాప్‌ యూజర్స్‌ కోసం గూగుల్ ఫొటోస్‌ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇక మీదట గూగుల్ ఫొటోస్‌లోనే వీడియోలను ఎడిట్ చేసుకునేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో యూజర్స్ తమ వీడియోలను యాప్‌లోనే అందంగా తయారుచేసుకోవచ్చు.

వీటిలో క్రాప్‌, ఫిల్టర్స్‌, బ్రైటెనెస్, కాంట్రాస్ట్‌తో పాటు మరో 30 రకాల ఎడిటింగ్ ఫీచర్స్‌ ఉన్నట్లు గూగుల్ తెలిపింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ గూగుల్ ఫొటోస్ ఐఓఎస్‌ యూజర్స్‌కి అందుబాటులో ఉండగా.. ఇకపై ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చని గూగుల్ తెలిపింది. దీంతోపాటు మరికొన్ని ఫొటో ఎడిటింగ్ టూల్స్‌ని గూగుల్ వన్ సబ్‌స్క్రైబర్స్‌, పిక్సెల్ ఫోన్ యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి మెషీన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తాయి. తాజా అప్‌డేట్‌లో పొట్రెయిట్ బ్లర్‌, పొట్రెయిట్ లైట్, కలర్‌ పాప్‌ వంటి టూల్స్‌ ఉన్నాయి. అయితే ఈ టూల్స్‌ ఉపయోగించాలంటే ఫోన్‌లో 3జీబీ లేదా అంతకంటే ఎక్కువ సామర్ధ్యం గల ర్యామ్‌.. ఆండ్రాయిడ్ 8 ఓరియో లేదా ఆ తర్వాతి ఓఎస్‌ కలిగి ఉండాలి. గతేడాది ఫొటోస్‌ యాప్‌లో ఫొటో ఎడిటింగ్ ఫీచర్‌ను గూగుల్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..

ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ వాట్సాప్ సేఫ్..!

డేటా లీక్ ఆరోపణలను ఖండించిన ‘కూ’ సీఈవో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని