
Google Maps: డేటా షేర్ చేస్తేనే గూగుల్ దారి చూపిస్తుంది!
ఇంటర్నెట్ డెస్క్: దూరప్రాంతానికి వెళ్లేటప్పుడు.. ఎలా వెళ్లాలో తెలియని సమయంలో ఠక్కున గుర్తుకొచ్చేది గూగుల్ మ్యాప్. గూగుల్ మ్యాప్‌ను చూసుకుంటూ ఎంచక్కా గమ్య స్థానానికి చేరుకోవచ్చు. అయితే గూగుల్ మ్యాప్స్‌లో కొన్ని మార్పులు చేయబోతోందని సమాచారం. ఇంతకుముందు వరకు మీ లోకేషన్ డేటాను షేర్ చేయకుండానే గూగుల్ మ్యాప్స్ సేవలను వినియోగించుకునే అవకాశం ఉండేది. అయితే త్వరలో మీ లోకేషన్ డేటాను గూగుల్‌తో షేర్ చేసుకుంటేనే మ్యాపింగ్ దారి చూపిస్తుంది. దీని వెనుకగల కారణాన్ని గూగుల్ వెల్లడించింది. యూజర్లకు మరింత మెరుగైన సేవలను అందించేందుకే లైవ్ ఇన్ఫర్మేషన్ను తీసుకుంటున్నట్లు గూగుల్ పేర్కొంది.
గూగుల్ మ్యాప్ యాప్‌ను ఓపెన్ చేసినప్పుడు పాప్అప్ మెసేజ్ ఒకటి కనిపిస్తుంది. ‘హౌ నేవిగేషన్ డేటా మేక్స్ మ్యాప్స్ బెటర్’ అనే పాప్అప్ డిస్ప్లే అవుతుంది. ఈ డేటాను యూజర్ నుంచి తీసుకుని ఇంకా మెరుగైన నేవిగేషన్ సేవలను అందిస్తామని గూగుల్ తెలిపింది. రియల్‌టైమ్ ట్రాఫిక్ కండీషన్స్‌ను బేరీజు వేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా గూగుల్ మార్పులు చేయనుంది. సాధారణంగా జీపీఎస్, బారోమీటర్ నుంచి డేటాను గూగుల్ సేకరిస్తూ ఉంటుంది. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. యూజర్ డివైస్తోకానీ, గూగుల్ ఖాతాతో అనుసంధానించకుండానే డేటాను తీసుకుంటామని చెబుతోంది. అయితే ఏ విధంగా స్వతంత్రను కలిగి ఉంటుందో మాత్రం తెలియజేయలేదు. డేటా షేరింగ్‌కు అనుమతి ఇవ్వకపోతే నేవిగేషన్ ప్రభావం ఉండొచ్చని టెక్ వర్గాలు పేర్కొన్నాయి. దీని మీద గూగుల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.