Google Meet: మీట్ కొత్త ఫీచర్.. ఆడియోను అక్షరాలుగా మార్చేస్తుంది!

గూగుల్ మీట్ యూజర్లకు గుడ్‌న్యూస్‌. ఆన్‌లైన్ మీటింగ్‌లో చర్చించుకున్న అంశాలను ఇకపై టైప్‌ చేయాల్సిన అవసరంలేకుండా కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఏంటా ఫీచర్‌? ఎలా పనిచేస్తుందో చూద్దాం.

Updated : 18 Oct 2022 11:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్ మీట్ యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో మీట్‌ కాల్స్‌లో జరిగే సంభాషణలను టెక్ట్స్‌గా మార్చుకుని, గూగుల్ డాక్‌ ఫార్మాట్‌లో సేవ్‌ చేసుకోవచ్చు. భవిష్యత్తులో వీటిని  గూగుల్ డ్రైవ్‌ నుంచి యాక్సెస్‌ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. గూగుల్ డ్యుయో యాప్‌ స్థానంలో డెస్క్‌టాప్‌/ల్యాప్‌టాప్‌, మొబైల్‌ యూజర్ల కోసం మీట్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.  తాజాగా ఇందులో ట్రాన్స్‌స్క్రైబ్‌ ఫీచర్‌ను గూగుల్ పరిచయం చేసింది. మీట్‌లో వీడియో కాల్ స్టార్ట్ అయిన తర్వాత.. కాల్‌ ట్రాన్స్‌స్క్రైబ్‌ అవుతున్నట్లు యూజర్లు తెలియజేస్తుంది. దానిపై క్లిక్ చేస్తే, సమావేశంలో చర్చించుకుంటున్న అంశాలను రికార్డు చేయడం ప్రారంభిస్తుంది. కాల్‌ పూర్తయిన తర్వాత రికార్డు చేసిన ఆడియోను టెక్ట్స్‌గా  మార్చి మీట్‌కు అనుసంధానంగా డ్రైవ్‌ స్టోరేజ్‌లో ఉన్నమీట్‌ రికార్డింగ్స్‌ అనే ఫోల్డర్‌లో సేవ్‌ చేస్తుంది.  ఈ ఫైల్‌ను మీటింగ్‌లో పాల్గొన్న సభ్యులెవరైనా యాక్సెస్‌ చేయొచ్చు.

అక్టోబరు 24 నుంచి ఈ ఫీచర్‌ను గూగుల్ వర్క్‌స్పేస్‌ బిజినెస్ స్టాండర్డ్‌, బిజినెస్ ప్లస్, ఎంటర్‌ప్రైజ్‌ స్టార్టర్‌, ఎంటర్‌ప్రైజ్‌ స్డాండర్డ్‌, ఎంటర్‌ప్రైజ్‌ ప్లస్‌, ఎడ్యుకేషన్‌ ప్లస్‌, టీచింగ్, లెర్నింగ్‌ అప్‌గ్రేడ్‌ కస్టమర్లకు పరిచయం చేయనున్నారు. తర్వాత సాధారణ యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకొస్తారట. ఇటీవలే గూగుల్ యూజర్ల ప్రైవసీ కోసం పాస్‌కీ అనే ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీంతో యూజర్లు పాస్‌వర్డ్‌ అవసరం లేకుండానే ఖాతాల్లోకి లాగిన్‌ చేయొచ్చు. టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ కంటే ఇది ఎంతో మెరుగ్గా ఉంటుందని గూగుల్ భావిస్తోంది. ప్రస్తుతం డెవలపర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలోనే సాధారణ యూజర్లకు పరిచయం చేయనున్నట్లు గూగుల్ తెలిపింది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని