Updated : 14 Nov 2021 15:11 IST

Google Play Store: గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఓటేశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆండ్రాయిడ్‌ యూజర్స్‌కు గూగుల్‌ ప్లేస్టోర్‌(Google Play Store) ఒక యాప్‌ల గని. ఎందుకంటే గనుల్లో తవ్వే కొద్ది బంగారం, బొగ్గు వచ్చినట్టు ప్లేస్టోర్‌లో యాప్స్‌ వెతికే కొద్దీ ఒక దానికి మించిన ఫీచర్స్‌తో మరొకటి దొరుకుతూ ఉంటాయి. అసలు ప్లేస్టోర్‌లో ఉన్న యాప్స్‌ సంఖ్య చెప్పలేముకూడా.. రోజుకి ఎన్నో కొత్త యాప్స్‌(Apps) పుట్టుకొస్తూ ఉంటాయి. మరి అన్ని యాప్స్‌లో ఏది బెస్ట్‌ అనేది నిర్ధరణకు రావడం కష్టం. దాని కోసం ప్రతి ఏడాది గూగుల్‌ ప్లే స్టోర్‌ ‘‘ప్లే యూజర్స్ ఛాయిస్‌ అవార్డ్స్‌’’ ప్రకటిస్తూ ఉంటుంది. ముందుగా ప్లేస్టోరే ఎంపిక చేసిన 10 గేమ్స్‌, 10 యాప్‌ల జాబితాను ఇచ్చి... ఓటు వేయండి అని కోరుతోంది. యూజర్సే ది బెస్ట్‌ యాప్‌కు ఓట్‌ వేసి గెలిపించాల్సి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం... ‘‘గూగుల్‌ ప్లేస్టోర్‌ యూజర్స్‌ ఛాయిస్‌ అవార్డ్స్‌(Awards) 2021’’లో పాల్గొనాలంటే.. కింద ఇమేజ్ క్లిక్‌ చేసి, మీరు మీకు నచ్చిన యాప్‌ లేదా గేమ్‌కు ఓటేసేయండి. 

యూజర్స్‌ ఛాయిస్‌ యాప్‌

🔶 ఎవర్‌గ్రీన్‌ క్లబ్‌(Evergreen Club): మానసిక ప్రశాంతత, ధ్యానం(Meditation), వ్యాయామం, డైట్‌ సలహాలు.. ఇలా అన్నిరకాల సమస్యలకు ఈ యాప్‌ పరిష్కారం చూపిస్తుంది.

🔷 ఫ్రంట్‌ రో(FrontRow): సంగీతం, పాటలు(Songs) పాడటం, క్రికెట్‌(Cricket) ఆడటం, కామెడీ చేయడం వంటివి నేర్చుకోవచ్చు.

🔶 ఎంబైబీ(EMBIBE): ఇది పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. ప్రభుత్వ, బ్యాంక్‌ పరీక్షల(Exams)కు సన్నద్ధం అయ్యే వారు ప్రాక్టీస్‌ కోసం ఈ యాప్‌ను ఎంచుకోవచ్చు. కష్టతరమైన సబ్జెక్టులు(Subjects), టాపిక్స్‌ను కూడా చాలా సులువుగా నేర్చుకునే ఆస్కారం ఉంటుంది.

🔷 సోర్టిజీ(Sortizy): మంచి మంచి వంటకాలను పరిచయం చేస్తుంది. ఏమైనా పదార్థాలను మనం ఎంచుకున్నా.. వాటిని బట్టి.. ఎలాంటి వంటకం చేసుకోవచ్చో కూడా సూచిస్తుంది. మీ డైట్‌ ప్లాన్‌కు తగ్గట్టు ఎటువంటి ఆహారం తీసుకోవాలో కూడా చెబుతుంది. 

🔶 బిట్ క్లాస్‌(BitClass): ఇది కూడా ఒక లెర్నింగ్‌ యాప్‌. మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు ఇక్కడ నేర్చుకోవచ్చు. లైవ్‌ క్లాస్‌లను అటెండ్‌ అవ్వొచ్చు.

🔷 క్లబ్‌ హౌస్‌(Clubhouse): మీ స్నేహితులతో(Friends), లేదంటే కొత్త వారితో పరిచయం పెంచుకొని.. వాళ్లతో మీకు నచ్చిన అంశాలపై మాట్లాడుకోవచ్చు. మీ ఆలోచనలను పంచుకోవచ్చు.

🔶 ఎవాల్వ్‌ మెంటల్ హెల్త్‌(Evolve Mental Health): బాగా నిద్రపోటానికి(Sleep), నిరాశ, వ్యాకులత నుంచి బయటపడి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోటానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ(CBT), మైండ్‌ఫుల్‌నెస్‌ అండ్‌ డైఎలక్ట్రికల్‌ బిహేవియరల్‌ థెరపీ(DBT) వంటి టెక్నిక్స్‌ నేర్పిస్తుంది.

🔷 బీయింగ్‌(being): మీరు బాధ, భయం, ఆందోళన, నిరాశ, విచారము.. ఇలా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా.. మీ మూడ్స్‌ను ఛేంజ్‌ చేయటానికి సూచనలు ఇస్తుంటుంది. 

🔶 సర్వ(SARVA): ప్రీగా యోగా(Yoga), మెడిటేషన్‌ లైవ్‌ క్లాస్‌లకు అటెండ్‌ అయి నేర్చుకోవచ్చు.

🔷 గార్డియన్స్ ఫ్రమ్‌ ట్రూకాలర్‌(Guardians from Truecaller): ఇది మహిళలు, చిన్న పిల్లలకు బాగా ఉపయోగకరం. ఎప్పుడైనా తెలియని ప్రదేశాలకు వెళ్లి కొత్త వ్యక్తులను కలవటానికి వెళ్లినప్పుడు.. మన కుటుంబ సభ్యులకు(గార్డియన్స్‌) మన జీపీఎస్‌ లొకేషన్‌(GPS Loaction) షేర్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎప్పుడైనా సురక్షితం కాదనుకుంటే ‘ఐ నీడ్ హెల్ప్‌’ ఫీచర్‌ను క్లిక్‌ చేస్తే.. మీరు యాడ్‌ చేసిన గార్డియన్స్‌ను అలర్ట్(Alert) చేస్తుంది.

యూజర్స్‌ ఛాయిస్ గేమ్‌

🔶 పోకీమాన్‌ యునైట్‌(Pokémon UNITE): ఇది పోకీమాన్‌ గో(Pokemon GO)కు భిన్నంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్రైనర్స్‌తో కలిసి ఆడాల్సి ఉంటుంది. మీకు నచ్చిన ఐదుగురిని ఎంపిక చేసుకొని ... ఒక టీమ్‌గా ఏర్పడి ప్రత్యర్థులతో పోరాడి గెలవాలి. అదిరిపోయే గ్రాఫిక్స్‌తో పోకీమాన్‌ యునైట్‌ గేమ్‌ను రూపొందించారు.

🔷 ప్రాజెక్ట్‌ మేకోవర్‌(Project Makeover): యువతులకు మేకప్‌(Make up) వేసి.. అందంగా రెడీ చేసే గేమ్‌. పిల్లలకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది.

🔶 మార్వెల్‌ ఫ్యూచర్‌ రివల్యూషన్‌(MARVEL Future Revolution): మార్వెల్‌ సినిమాలంటే ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిందే. మంచికి, చెడుకు జరిగే యుద్ధం నేపథ్యంలో మంచి గ్రాఫిక్స్‌తో ఈ గేమ్‌ సాగుతుంది.

🔷 గరేనా ఫ్రీ ఫైర్‌ మాక్స్‌(Garena Free Fire MAX): రకరకాల ప్రదేశాల్లో మనకి ఇష్టమైన ఆయుధాలను సేకరిస్తూ.. ప్రత్యర్థులను చంపుతూ.. లక్ష్యాన్ని చేరుకోవల్సి ఉంటుంది. ఈ గేమ్‌ లక్ష్యం ఒక్కటే... ప్రత్యర్థులను ఎదిరించి నిలవటమే.

🔶 క్రాష్‌ బందికూట్‌(Crash Bandicoot): టెంపుల్‌ రన్‌, సబ్‌వే సర్ఫర్‌లానే ఈ గేమ్‌ కూడా ఉంటుంది. కోతికి చిక్కకుండా పండ్లను సేకరించుకుంటూ అలా ఎంత దూరమని తెలియకూండా వెళ్తూ.. పాయింట్లను సంపాదించడమే...

🔷 సమ్మోనర్స్‌ వార్‌(Summoners War): మంచు పర్వతాల్లో, ఎత్తైన కొండ ప్రాంతాల్లో, వివిధ ప్రదేశాల్లో మాన్‌స్టర్స్‌తో జరిగే యుద్ధం.. గేమర్స్‌కు మంచి అనుభూతిని ఇస్తుంది. 

🔶 బీట్‌ స్టార్‌(Beatstar): ఇదొక మ్యూజిక్(Music) గేమ్‌... మనకు నచ్చిన బీట్స్‌ను ఒక రిథమ్‌లో వాయిస్తూ... ఆడుకోవచ్చు.

🔷 బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా(Battlegrounds Mobile India): ఈ గేమ్, ఆడటానికి పూర్తిగా PUBG మాదిరిగా ఉంది. అయితే, ఈ రెండింటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.

🔶 ది వాకింగ్‌ డెడ్‌(The Walking Dead): జాంబీస్‌లను చంపుతూ.. వాటిని ఎదుర్కొంటూ.. మనల్ని మనం కాపాడుకోవడమే ఈ గేమ్‌ లక్ష్యం.

🔷 స్కోర్‌(Score!): సాకర్‌(soccer) ప్రియులకు ఈ గేమ్‌ బాగా నచ్చుతుంది. 

మీ ఓటు(Vote)ను ఎప్పుడైనా మార్చుకోవచ్చు. నవంబర్‌ 17వరకు మీకు ఆ వెసులుబాటు ఉంటుంది. గెలిచిన యాప్స్‌ను గూగుల్‌ నవంబర్‌ 29న ప్రకటిస్తుంది. 

Read latest Gadgets & Technology News and Telugu News

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని